Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టరేట్ ఎదుట వ్యాకాస ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ-జనగామ
జీవో నెంబర్ 58 ప్రకారం ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదల కు పట్టాలు ఇవ్వాలిఅని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏదు నూరి వెంకటరాజం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ప్రజాసంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలోప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న లబ్ధిదారులు తమకు పట్టాలి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట కలెక్టరేట్ వద్ద ధర్నానిర్వహించారు.ఈ సందర్భంగా వెంకట్రాజం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే విడుదల చేసిన జీవో నెంబర్ 58నీ అమలు చేస్తూ, 120 గజాల ఇంటి స్థలాన్ని పేద ప్రజలకు రెగ్యులరైజ్ చేయాలన్నారు.జీవో నెంబర్ 59 ని అమలు చేస్తూ వారికి రెగ్యులరైజ్ చేయడం కోసం నిబంధనలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం పేదల పట్ల పక్షపాతంగా వ్యవహరించడం దారుణమైన విషయం అన్నారు. జనగామ జిల్లాలోని లింగాల గణపురం మండలం నెల్లుట్లలోని ప్రభుత్వ భూమిలో సుమారు 2000 మంది, చిలుపూరు మండలం రాజవరం గ్రామంలోని ప్రభుత్వ భూమిలో 150 మంది పేదలు గత కొంతకాలంగా గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారని, వీరిని జీవో నెంబర్ 58కి అర్హులను చేస్తూ 120 గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తూ పట్టాలు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇంటి స్థలం పట్టా తో పాటు ఇంటి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయలు మరియు కేంద్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయలు సాయంగా అందించాలని కోరారు. ప్రభుత్వ భూములను ధనవంతుల ఆక్రమించుకుంటే ఒక రకంగా పేదలు ఆక్రమించుకుంటే మరొక రకంగా వ్యవహరించకుండా ఉండాలం టే కచ్చితంగా జీవో నెంబర్ 58ని అమలు చేయాల్సిందేనని అన్నారు. లేని పక్షం లో పేదలని సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిం చడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు సింగార పు రమేష్, నాయకులు వెన్నపూస కుమార్, పోత్కనురి ఉపేందర్, గంగాపురం మహేందర్, దుర్గా ప్రసాద్, పొలాస కిష్టయ్య,శంకరయ్య, పుల్ల రాజేశ్వరి, మును గొండ రేణుక, గడ్డం రేణుక, సరిత, ఎడ్ల ప్రశాంత్, విష్ణు,రామ్ నాగేష్ మబ్బు వెంకటేష్, మల్లేశం, కుంభం రాజు, కాకర్ల పద్మ, కాకర్ల బాబు తదితరులు పాల్గొ న్నారు. ధర్నా అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది.