Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ కలెక్టరేట్
ఆధార్ కార్డు నవీకరణ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని మీడియా సమావేశ మందిరంలో జరిగిన జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలు, పౌర సేవలను పొందాలనుకునేవారు ఆధార్ అప్డేట్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసుకో వాలని సూచించారు. వివిధ ఉద్యోగాల దరఖాస్తులు, బ్యాంక్ ఖాతాలు, ధృవపత్రా లు పొందేందుకు, స్థలాల రిజిస్ట్రేషన్‌కు, సిం కార్డు తీసుకునేందుకు, రేషన్ కార్డు పొందడం వంటి పలు సేవలు సులభంగా పొందాలంటే ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేసుకోవాలని ఆయన కోరారు. ఆధార్ ఆధారంగా కొనసాగుతున్న సేవలను భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్డు వివరాలు పునరుద్ధరించు కోవాలని కోరారు. 18 సంవత్సరాలలోపు ఆధార్ నమోదు నవీకరణలు 100% పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పుట్టిన పిల్లలకు ఆధార్ పొందేలా ఆస్పత్రుల్లో చర్యలు చేపడుతున్నట్లు, అన్ని ఆసుపత్రుల్లో ఈప్రక్రియ జరిగేలా చర్య లు తీసుకుంటున్నట్లు వివరించారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలో ఆధార్ ప్రక్రియ చేపట్టి 100% పూర్తిగా కార్యాచరణ చేయాలన్నారు. 15 సంవత్సరాలలో పిల్లలకు ఆధార్ అప్డేట్ చేయడం పూర్తిగా ఉచితంగా రెండుసార్లు అవకాశం ఉం దని, విద్యాసంస్థలతో సమన్వయ చేసుకుని పూర్తి చేయాలని ఆయన సూచిం చారు. ఆధార్ అప్డేట్ కు సంబంధించిన సమాచారం వివరాల కొరకు టోల్ ఫ్రీ నెంబరు 1947 వినియోగించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఎన్ఐసి రాం ప్రసాద్ ఈడీఎం దుర్గారావు జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.