Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ (ఎమ్ఎల్) ప్రజాపంథా డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రవి
నవతెలంగాణ-తొర్రూరు
తను నమ్మిన విశ్వాసాలకు అనుగుణంగా జీవి స్తూ తన భావాలను బహిరంగపరుస్తున్న నాస్తికుడు బైరి నరేష్ పై భౌతిక దాడిని సిపిఐ (ఎంఎల్) ప్రజాపంథా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రవి అన్నారు. మంగళవారం తో ర్రూర్లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాం గం ఆర్టికల్ 19 నుండి 21 వరకు జీవించే హక్కుతో పాటు తన రాజకీయ భావాలను స్వేచ్ఛగా దేశంలో ఎక్కడైనా చెప్పుకునే అవకాశాన్ని ఇచ్చిందని అన్నారు. ఇతరుల మనోభావాలను గాయపరచకుండా తన భా వాలను బహిరంగపరుచుకోవాలని సుప్రీంకోర్టు సై తం అనేక తీర్పులలో స్పష్టం చేసిందని ఆయన అన్నా రు. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ఇతరులను వారి మనోభావాలను కించపరిస్తే చట్టం పరిధిలో అవసరమైన సెక్షన్లు నమోదు చేసి కేసులు పెట్టాలి. కానీ ఇలా దారికాచి దాడిచేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. హిందూ వాహిని పేరుతో కొంత మం ది పోలీసు రక్షణలో వాహనంలో ఉన్న బైరి నరేష్ పై దాడి చేయటం జీవించే హక్కును రాజకీయ స్వేచ్ఛ హక్కును కాలరాయటమేనన్నారు.సమాజంలో రక్షణ గా ఉంటున్న పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరగ టం ఆక్షేపణీయమన్నారు. దాడి చేసిన గుండాలను గుర్తించి అత్యాయత్నం కేసును నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సైన్సును బోధించే వారికి మత మౌడ్యం నింపుకున్న వారితో ఘర్షణలు దాడులు చరి త్రలో అనేకం ఉన్నాయని చివరికి సైన్సే ఆజ్యయంగా నిలుస్తుందన్నారు. సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని చెప్పిన గెలీలియోను, ప్రతిదానిని ప్రశ్నించండి అని బోధిం చిన సోక్రటీస్‌ను, భూమి సూర్యుని చుట్టూ తిరుగు తుందని నిరూపించిన బ్రూనో,కోపర్నికస్ ఇలా ఎం దరో భౌతిక సామాజిక శాస్త్రవేత్తలను నాటి మత గబ్బిలాలు వెంటాడి దాడి చేసి చంపినా ప్రజలకు వి జ్ఞాన శాస్త్రాన్ని అందించారన్నారు.నాస్తిక వాదం, హేతువాదం,శాస్త్రీయ ధృక్పదాలపై జరుగుతున్న భౌతిక దాడులను భావజాలల తప్పుడు ప్రచారాలను ప్రజలు, ప్రజాస్వామికవాదులు నిరసించాలని అం దుకు వ్యతిరేకంగా విద్యమించాలని ఆయన పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) ప్రజాపంథా తోర్రూర్ సబ్ డివిజన్ కార్యదర్శి ముం జం పల్లి వీరన్న, బందు శ్రీను, గుగులోతు శ్రీను, మంగళపల్లి ప్రసాద్, వెంకన్న, నరసింహ తదితరులు పాల్గొన్నారు.