Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీపీ కార్మికుల నిరసన, వినతి
నవతెలంగాణ-నెల్లికుదురు
గ్రామపంచాయతీలో పని చేస్తున్న కార్మికులకు పెండింగ్లో ఉన్న ఆరు నెలల వేదనలను తక్షణమే అందించాలని సీఐటీయూ మండల కార్యదర్శి ఈసం పల్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండ ల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు ఖాళీ ఇస్తార్లు పట్టుకొని బువ్వ వేయండి అని నిరసన తెలిపి ఎంపీడీవో శేషాద్రికి సమస్యలు పరిష్కరించా లని కోరుతూ మంగళవారం వినతిపత్రాన్ని అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ గ్రామ పంచాయతీలు విధులు నిర్వహిస్తున్న జిపి సిబ్బందికి గత ఆరు నెలలుగా కీర్త నలు రాక పూట గడవక అనేక ఇబ్బందులు కుటుం బ సభ్యులు ఎదుర్కొంటున్నారన్నారు. కనీసం మాకు తినడానికి కూడా తిండి లేక పిల్లల బడులకు పంపిం చలేక వారికి ఫీజు కట్టలేక వచ్చే వేతనం రాకపోవ డంతో అనేక సమస్యలతో కుటుంబం ఇబ్బందులకు గురవుతుందని అన్నారు.గ్రామాలలో పారిశుద్ధ్య కార్మి కుల తోటి చెత్తాచెదారం మురికి కాలువలు దుర్వా సన వస్తున్న గాని వారు అనేక ఇబ్బందులకు ఓర్చు కొని పనిచేస్తున్నారని, వారి కష్టాన్ని గమనించకుండా కుటుంబంలో అనేక ఇబ్బందులు పడుతున్న ప్రభు త్వం ఏమాత్రం పట్టింపు లేనట్లుగా ఉంటుందన్నారు. గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని. ఉద్యోగ భద్రత కల్పించాలని, పర్మి నెంట్ చేయాలని, లైఫ్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిం చాలని, వారికి ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు కాంట్రాక్టర్లకు ఇచ్చిన సౌకర్యాలు కార్మి కులకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తి గా విఫలమయ్యారని ఆయన అన్నారు.తక్షణమే గ్రామపంచాయతీ కార్మికులకు ప్రత్యేక బడ్జెట్ కేటా యించి వారికి నెలనెలా ఎకౌంట్లో జమ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియెడల పెద్ద ఎత్తున కార్మికులను సమీకరించి పోరాటాలు ఉధృతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాంబాబు, యాకయ్య, వెంకన్న, నరసయ్య, రేణుక, వెంకటమ్మ, హెచ్ మల్లయ్య, ఇద్దయ్య, తదితరులు పాల్గొన్నారు.