Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా - సీపీఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి
నవతెలంగాణ-జనగామ
సంపన్నుల పన్ను రాయితీ రద్దు చేయాలని సిపిఎం జనగామ జిల్లా కార్యద ర్శి మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం సిపిఎం జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జనగామ పట్టణంలోని ఆర్టీసీ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా పార్టీ జిల్లా కార్య దర్శి మోకు కనకారెడ్డి పాల్గొని మాట్లాడుతూ సంపన్నులకు రాయితీలు ఇచ్చి సామాన్యులపై పన్నులు వేసే కేంద్ర ప్రభుత్వ విధానాలపై దేశవ్యాప్త నిరసనలో భాగంగా ధర్నా నిర్వహించడం జరిగిందని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం సంపన్నులకు లక్షల కోట్ల రాయితీలిస్తూ ఆహార పదార్ధాలు, మెడిసిన్స్ జీఎస్టీ విధించే విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో అతి సంపన్నులు పెరిగిపోతున్నారని, వారికి కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున పన్ను మిన హాయింపులిస్తున్నదని, ఆ పన్ను మినహాయింపులను రద్దు చేయాలని, సంపద పన్ను విధించాలని డిమాండ్ చేశారు. ఆహారసరకులు, నిత్యావసరాలు, ఔషదాల పై జీఎస్టీ విధించడం కారణంగా సామాన్యులకు తీవ్రమైన భారంగా మారుతు న్నది. తక్షణమే వీటిపై జీఎస్టీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్లో గ్రామీణ ఉపాధిహామీ చట్టానికి నిధులు తగ్గించారని, తక్షణమే కేటాయింపులు పెంచాలని, కూలిరేట్లు పెంచాలని కోరారు. రేషన్ దుకాణాల్లో ఉచిత బియ్యంతో పాటు 5కేజీల సబ్సిడీ బియ్యం కూడా కొనసాగించాలని, పేదలకు ఆహారభద్రత పెంచేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. దేశ సంపదను కొల్లగొడుతూ, కుంభకో ణాలకు పాల్పడుతున్న అదానీ వ్యవహారంపై విచారణ జరపాలని డిమాండ్ చేశా రు. మోడీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై మరో స్వాతంత్రపోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పి. ఉపేందర్, ఎస్. విజేందర్, బి. చందు నా యక్, ఆర్. మీట్యానాయక్, కె.లింగం, డి.సందీప్, ఎ సురేష్, టి.గణేష్ నాయక్, బి.బాబు. జి.మల్లేష్ రాజ్, డి.నాగరాజు, సిఎచ్.ఉపేందర్, గాడి శివ, ఎండి. మునీర్ తదితరులు పాల్గొన్నారు.