Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడ
ప్రజల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేసిన నల్లెల కుమారస్వామన్న లేని లోటు తీరనిదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య అన్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వ ర్యంలో మంగళవారం మండల కేంద్రంలో నల్లెల కుమారస్వామి సంతాపసభ నిర్వహించి ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కార్యక్రమాలను నిర్వహించి తన వంతు పాత్రను పోషించాడన్నారు. సోనియమ్మ రు ణం తీర్చుకోవాలంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కృషి చేయాలని పార్టీ అభివృద్ధి కోసం ఎంతో శ్రమించారని కొనియాడారు. కుమారన్న మృతి కాంగ్రెస్ పార్టీకి తీర ని లోటని వారు లేని లోటును తీర్చలేమని వారి ఆత్మ కు శాంతి చేకూర్చాలని కోరుతూ మౌనం పాటించా రు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ చల్లా నారాయణరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర బోయిన మొగిలి, మండల ప్రధాన కార్యదర్శి బిట్ల శ్రీనివాస్, ఎంపీపీ బానోత్ విజయ రూప్ సింగ్, జడ్పీటీసీ పులుసం పుష్పలత, వైస్ ఎంపీపీ కాడ బోయిన జంపయ్య,జిల్లా నాయకులు బానోత్ విజ య రూప్ సింగ్, వీరనేని వెంకటేశ్వర్లు,గుమ్మడి సమ్మ య్య, గోవిందాపురం సర్పంచ్ ఇరుప రాజేశ్వర్, మం డల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు ఎండి సయ్యద్, కిసా న్ మజ్దూర్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు ఉల్లెంగుల రమేష్, ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షులు బానోత్ వినోద్ కుమార్, నాయకులు వెలుదండి వేణు, కట్ రోజు బిక్షపతి, నోముల ప్రశాంత్, బొల్లు రమేష్, బోడ ఈర్య, కార్లాయి ఉపసర్పంచ్ కేదాసు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.