Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'కంటి వెలుగు'ను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి
- వరంగల్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతివెంకటరమణరెడ్డి
నవతెలంగాణ-శాయంపేట
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్య రంగానికి పెద్దపీట వేస్తుందని వరంగల్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. మండలంలోని నేరేడుపల్లి, పత్తిపాక గ్రామాలలో మంగళవారం ఏ ర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాలను ముఖ్యఅతిథిగా జడ్పీ చైర్ప ర్సన్ జ్యోతి పాల్గొని ప్రారంభించి మాట్లాడారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు కంటి వెలు గు కార్యక్రమం విజయవం తం చే స్తున్నారని, అతిత్వరలో గిన్నిస్ రి కార్డు ఎక్కే అవకాశాలు ఉన్నాయ న్నారు. సర్వేంద్రియానం నయనం ప్రధానమని, ప్రతి ఒక్కరికి కంటి సమస్యలు ఉంటాయని, 18 ఏళ్ల పైబడిన ప్రతి ఒక్కరు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడు తున్న రెండో విడత కంటి వెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, సబ్ సెంటర్లలో వైద్యుల నియామ కం చేపట్టి, పల్లె దావకానల ద్వారా వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షే మ పథకాలు, అభివద్ధి పనులను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు అర్థర హిత విమర్శలు చేస్తున్నాయని, ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అ న్నారు. బీజేపీ పరిపాలన రాష్ట్రంలో ఉచితంగా విద్య, వైద్యం ఇస్తుం దా అని ప్రశ్నించారు. విద్యారంగానికి ప్రాధాన్యతనిస్తూ నిరుపేదలు చదువుకోవడానికి వందలాదిరిగా గురుకులాలు ఏర్పాటు చేసిందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సుఖప్రసవాల సంఖ్య పెరగడానికి ప్రభుత్వం కేసీఆర్కిట్లు పంపిణీ చేస్తుందన్నారు. కంటి వెలుగు శిబి రంలో రోజుకు 200 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా అద్దాల పంపిణీ చేస్తారని, శస్త్రచికిత్సలు అవసరమైన వారిని గుర్తిం చి ఎంజీఎంకు రెఫర్ చేస్తారని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, స్థానిక స ర్పంచ్‌లు చిట్టిరెడ్డి రాజిరెడ్డి, ఆకుతోట రాజేష్, బిఆర్ఎస్ పార్టీ మం డల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి, వైద్యాధికారి డాక్టర్ అఖిల్, ఉప సర్పంచ్ తుడుం సరోజనామల్లయ్య, వార్డుసభ్యులు రామ రా జు, స్వామి, ఐలయ్య,మొగిలి,నాయకులు జయపాల్ రెడ్డి, శ్యాం సుందర్‌రెడ్డి, ప్రవీణ్, కిరణ్, ఆప్తాల్మిక్ ఆఫీసర్ రవీందర్, ఎంపీడీవో కృష్ణమూర్తి, ఎంపీఓ రంజిత్ కుమార్, వైద్య సిబ్బంది చలపతి, హే మలత, స్వరూప పాల్గొన్నారు.