Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాయపర్తి
గణేష్ కుంట తండా గ్రామ పంచాయతీకి మహర్దశ వచ్చిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద యాకర్రావు అన్నారు. మంగళవారం మండలంలోని గణేష్ కుంట తండాలో గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్న గ్రామ ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేపట్టి గడప గడప తిరుగుతూ గిరిపుత్రులను ఆప్యాయంగా పలకరించారు. టి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మునవత్ నరసింహ నా యక్ చేపట్టిన విందులో పాల్గొని కార్యకర్తలతో ముచ్చ టించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దైవ ఆధ్యాత్మిక చింత నతో శాంతియుత జీవితాన్ని పొంద వచ్చు అన్నారు. గ్రామాల్లో ఆలయా లను ఏర్పాటు చేసుకోవడం శుభ సూచికమని పేర్కొన్నారు. సీఎం కేసీ ఆర్ ఆలయాల పూర్వ వైభవానికి ఎ నలేని కృషి చేస్తున్నారని కొనియాడా రు. పాలకుర్తి నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయా లను అభివృద్ధి చేసేందుకు ప్రణా ళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రతిపల్లెను అభివృద్ధి పథంలో నడిపించడమే అంతిమ ల క్ష్యంగా పనిచేస్తున్నట్లు వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో ఎస్టీకార్పొరేషన్ మాజీ చైర్మన్ గాంధీ నాయక్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు బిల్లా సుధీర్ రెడ్డి, రైతుబంధు మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్ రావు, సర్పంచ్లు మునావత్ సుజాత నరసింహనాయక్, గ జ్జవెళ్లి అనంత ప్రసాద్, ఎంపీటీసీ బండి అనూష రాజబాబు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకు లు, కార్యకర్తలు పాల్గొన్నారు.