Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
కాకతీయ మెడికల్ కాలేజీలో జరిగి న వైద్య విద్యార్థి డాక్టర్ ప్రీతిది హత్యా..! ఆత్మహత్యా..! అనే అనుమానాలు పలు వురు నుండి వ్యక్తమవుతున్నాయి. కాకతీ యమెడికల్ కాలేజీలో మొదటి సంవత్స రం చదువుతున్న విద్యార్థిని డాక్టర్ ప్రీతి ఆదివారం రాత్రి నిమ్స్‌లో చికిత్స పొందు తూ తుదిశ్వాస విడిచిన విషయం విధి తమే. చురుకుగా ఉండేడాక్టర్ ప్రీతి పది, ఇంటర్లో మెరిటి సాధించి వైద్య వృత్తిపై మక్కువతో ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత ప్రాథమి క ఆరోగ్య కేంద్రంలో ఉద్యోగం వచ్చినా వెళ్లకుండా పీ జీ మొదటి సంవత్సరంలో కాకతీయ మెడికల్ కాలే జీలో చేరి ఉన్నతమైన చదువులు చదివి పేదలకు సే వలందిస్తుందని అనుకున్న క్రమంలోసైఫ్ అనే మాన వ మృగం ర్యాగింగ్ చేసి డాక్టర్ ప్రీతి ని బలిగొన్నడనే ఆరోపణలు రావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రే గింది. సైఫ్ చెప్పిన మాటలను ఎదిరిచినందుకే సైఫ్ మత్తు ఇంజక్షన్ఇచ్చి హత్య చేశాడా.. లేదా సైఫ్ ర్యా గింగ్ చేసినందుకు డాక్టర్ ప్రీతి ఆత్మహత్య చేసుకుం దా ? లేక ఈ సంఘటన వెనుక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయే మో.. అనే అనుమానాలు పలు వురి నుండి వ్యక్తమవుతు న్నాయి. డాక్టర్ ప్రీతి కి సైఫ్‌తో జరిగిన ఇబ్బంది ని ప్రిన్సిపాల్, హెచ్ వో డీ లకు చెప్పిన వెంటనే స్పం దిస్తే ఈ సంఘటన జరగ క పోవచ్చు ఏమో అని ప లువురు గుసగుస లాడు కుంటున్నారు. పోలీసులు స్పందించిన రీతిగా కాకతీయ మెడికల్ కాలేజీ హెచ్ వొడి, ప్రిన్పిపాల్లకు చెప్పినపుడు వారు సరైన సమ యంలో స్పందించి డాక్టర్ ప్రీతికి మనోధైర్యం ఇచ్చి సైఫ్‌పై చర్యలు చేపడితే ఇటు డాక్టర్ ప్రీతికి ఇట్లాంటి సంఘటన జరుగక పోవచ్చు ఏమో, వారి తల్లి తం డ్రికి పుట్టెడు దుఃఖంవుండేది కాదేమో అని పలువురు అనుకుంటున్నారు. సైఫ్ జీవితం ఈ విధంగా వుండే ది కాదేమో, ఇరువురి తల్లి తండ్రులకు పుత్రశోకం వుండేది కాదేమో అని పలువురు గుసగుస లాడుకున్నారు.
ఇది ఇలా ఉంటే ఇంత పెద్ద కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ నివారణ కమిటీ లేకపోవడం వలననే చాలా మంది జూనియర్ విద్యార్ధుల కు జరిగిన సంఘటనలు కూడా బయటికి రానివి చాలా వున్నాయని పలువురు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నా రు. ఈలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రజా సం ఘాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు మానవహారాలు చేస్తున్నారు.
అప్పటి వరకు పోలీసులు ప్రజా సంఘాలు, వి ద్యార్థి సంఘాలు చేసిన ధర్నా లను ఆపడానికి ఎక్కు వ శ్రమపడుతున్నారు.తప్ప సంఘటనలు జరుగకుం డా ప్రత్యేక చర్యలు తీసుకుంటలేరని పలువురు గుస లాడుకుంతున్నారు.ఆ తరువాత పోలీసు వ్యవస్థ ఈ లాంటి విషయాల్లో ప్రేక్షక పాత్ర పోషస్తున్నారనే ఆరో పణలు వెల్లువెత్తుతున్నాయి. ఈలాంటి సంఘటనలు జరిగక ముందే ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి,ఈలాంటి సంఘటనలు పునావతం కాకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు అను కుంటున్నారు.
ఏది ఏమైనప్పటికి సంబంధిత అధికారులు ప్ర త్యేక విచారణ కమిటీ వేసి డాక్టర్ ప్రీతిది హత్య..! ఆ త్మహత్యా..! నిజ నిర్ధారణ చేసి తేల్చాసిందే అని పలు వురు అనుకుంటున్నారు.