Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హన్మకొండ
ఇంట్లో వాడిన చెత్తను తిరిగి ఉపయోగించుకొని ఇంటిలోనే కంపోస్టు ఎరువును తయారు చేసుకునే విధానంపై ప్రజలను చైతన్యవంతం చేస్తూ వరంగ ల్ మున్సిపల్ కార్పొరేషన్, ఇంజనీరింగ్ ఇండియా, ఎంజీఎఫ్ వాకర్స్ మరియు ప్రే రణ ఫౌండేషన్ సంయుక్తంగా చేపట్టిన అవగాహన కార్యక్రమం లో భాగంగా మంగళవారం హనుమకొండలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆవరణలో కంపోస్ట్ తొట్టెను ఏర్పాటుచేసిసేంద్రియ కంపోస్టు ఎరువు తయార కేంద్రం ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ప్రేరణ ఫౌండేషన్ అధ్యక్షులు చెత్తను రీసైక్లింగ్ చేసే విధా నంపై హనుమకొండలో బాల సముద్రంలోని కూరగాయల మార్కెట్, ఎన్జీవోస్ కాలనీలోని కూరగాయల మార్కెట్లలో కాలనీవాసులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని ఇలాంటి కార్యక్రమాల ద్వారా నగరంలోని ప్రజలందరూ అవగాహన పెంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి సానిటరీ ఇన్స్పెక్టర్ భీమయ్య, గోల్కొండ శ్రీనుగ, ప్రేరణ అధ్యక్షులు పి ఉపేందర్ రెడ్డి , ఉ పాధ్యక్షులు ఆర్తి సంపత్, ఎంజీఎఫ్ వాకర్ కార్యదర్శి బూరా రామచంద్ర మరియు పోలీసు హెడ్ క్వార్టర్ ఉద్యోగస్తులు హాజరయ్యారు.