Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాలువ పనుల్లో 12 ఇంచులకు బదులు 4-6 ఇంచులు పోసింది వాస్తవమే : పీఆర్ ఏఈ లతా
నవతెలంగాణ-ఆత్మకూర్
కాకతీయుల కాలం నాటి సైడ్ డ్రైనేజ్ నిర్మాణం పనుల్లో ఫీట్ కు బదులు ఆరు ఇంచులు వేసింది వాస్తవమే అని ఇంజనీరింగ్ అధికారులు ఒప్పుకున్నారు. మంగళవారం ఆత్మకూరు మండల కేంద్రంలో జరుగుతున్న నిర్మాణం పనుల్లో నాణ్యత లోపంచడంతో నవతెలంగాణ లో ఈనెల 22 న నాసిరకం పనులు... పట్టించుకోని అధికారులు అనే వార్తను చూసి స్పందించిన కాకతీయ యూనివర్సిటీ జాక్ నేతలు,బీజేపీ పరకాల నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ పెసారు విజయ్ చందర్ రెడ్డి తో పాటు బీజేపీ నేతలు ఇర్సడ్ల సదానందం,జిల్లా ప్రోటోకాల్ ఏదుల పురం శ్రవణ్ కుమార్,ఉప్పుగల్లు శ్రీకాంత్ రెడ్డి పాటు పరిశీలించారు. వారు మాట్లాడుతు నవతెలంగాణ పత్రికలో వచ్చిన వార్త వాస్తవమే అని తేల్చారు. నాసిరకం పనులతో పాటు ఫీట్ కు బదులు నాలుగు ఇంచులు మాత్రమే పోశారని తెలిపారు. అలాగే జిల్లా ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షులు కమలాపురం రమేష్,రాష్ట్ర సర్పంచ్ ఫోరమ్ నాయకులు పర్వతగిరి రాజు కాంగ్రెస్ జిల్లా నేతలు కోటి డెబ్భై లక్షల రూపాయలతో నిర్మాణం అవుతున్న కాలువ పనులను పరిశీలించి అవాక్కయ్యారు. ఇంత దారుణంగా జాతీయ ఉపాధి హామీ పథకంలో మంజూరు అయినా నిధులతో అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల అండ దండలతో నాసిరకంతో పనులు చేస్తున్నారని వారు ఇంజనీరింగ్ అధికారుల పై మండిపడ్డారు. కాకతీయుల కలం నాటి 15 ఫీట్ల కాలువను వెడల్పు గల కాలువను కుదించి నాసిరకంతో కూడిన పనులు చేయడం వాళ్ళ మూడు నెల్లకే శిథిలం అవుతుందని అన్నారు.ఇంజనీరింగ్ అధికారులు కాసులకు కాకతి పడి కాంట్రాక్టర్ తో కుమ్మకై నాసిరకం పనులు చేయడం ఎంతవరకు సంజసం అని జిల్లా ఎంపీటీల ఫోరమ్ అధ్యక్షలు కమలాపురం రమేష్ ప్రశ్నిచారు. అడిగే వారు లేరని కాంట్రాక్టర్ నాసిరకంగా పనులు చేస్తూ భారీగా బిల్లులు స్వాహా చేస్తూన్నరని.. దీనిపై జిల్లా ఉన్నత అధికారులు స్పందించి పనుల పై విచారణ జరిపించాలని డిమాండ్ చేసారు.కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాసిరకం పనుల పై ఆందోళన చేస్తామని వారికీ హెచ్చరించారు. ఆత్మకూరులో అభివద్ధి మూసుకులో నాసిరకం పనుల పై గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. అభివద్ధి కంటే దోపిడీ ఎక్కువ జరుగుతుందని గ్రామస్తులు అంటున్నారు.
ఏది ఏమైనా ఆత్మకూరు మండల కేంద్రంలో జరుగుతున్న నాణ్యత లోపంతో జరుగుతున్న పనుల పై వరస కధనాలు రావడంతో పంచాయతీ రాజ్ డీఈ లింగ రెడ్డి,ఏఈ లతలు పరిశీలించి నాలుగు నుండి ఆరు ఇంచులు వచ్చింది వాస్తవమే అని అన్నారు. కాట్రాక్టర్ చేత తిరిగి మరో ఆరు ఇంచులు వేయిస్తామని తెలిపారు. ఇప్పటి నుండి స్థానికంగా ఉండి నాణ్యతతో కూడిన పనులను చేయించిన తరువాతనే ఎంబీ రికార్డ్ చేస్తామని అన్నారు. పనులు కాకుండా ఎట్టి పరిస్థితుల్లో బిల్లు చేయమని తెలిపారు.