Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -తాడ్వాయి
మండలంలోని కాటాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేసి విద్యార్థులచే పలు ప్ర యోగాలు చేయించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి ఏ జయదేవ్ పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు పరిశీలన, పరిశోధనాత్మక దక్పథం అలవర్చు కోవాలన్నారు. కాటాపూర్ జెడ్పిహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు ఎండీ జాఫర్ అలీ, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం పాయం మానేశ్వర రావు సైన్స్ ఉపాధ్యాయులు వి శ్రీనివాస్, జి రాజేష్, పీడీ మదన్మోహన్, ఉపాధ్యాయులు పద్మజ, సంధ్యారాణి, అక్బర్ పాషా, జయపాల్, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గోవిందరావుపేట : విద్యార్థులు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ఎంతో ఎత్తు ఎదగాలని డీఆర్డీఓ నాగ పద్మజ అన్నారు. మంగళవారం జాతీయ సైన్స్ డే సందర్భంగా ప్రభుత్వ బాలికల పాఠశాలలో రామన్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి మాట్లా డారు. ఈ సందర్భంగా పలు విద్యాలయాలు, అంగన్ వాడి కేంద్రాలు ఆకస్మిక తనిఖీలు చేసి వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించారు. అనంతరం జాతీయ సైన్స్ డే సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన ఎగ్జి బిట్లను ప్రారంభించారు. బాలికల పాఠశాల ప్రదానో పాధ్యాయురాలు జ్యోతి, సైన్స్ టీచర్‌ను అభినందించారు. సర్పంచ్ లక్ష్మి జోగానాయక్, ఎంఈఓ గొంది దివాకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కాటారం : కాటారం మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను మంగళ వారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భం గా విద్యార్థుల సందర్శనార్థం వివిధ సైన్స్ ప్రద ర్శనలు ఏర్పాటు చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ హరిగోప్పల రాజేందర్, వైస్ ప్రిన్సిపాల్ సిరిసిల్ల శ్రీనివాస్, జే శ్రీలత, సైన్స్ ఉపాధ్యాయులు కే సంధ్యారాణి, కే రాజయ్య, బి శ్రావణ్, ఆర్ సంతోష్, గోపాలకృష్ణ, నాగేశ్వరరావు, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
మంగపేట : జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా మంగళవారం మండల కేంద్రం లోని జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిట్స్ ఆహుతులను అలరించాయి. స్కూల్ మేనేజ్మెంట్ చైర్మన్ ధీగొండ నర్సింహారావు, కస్తూరిబాయి ఎన్జీఓ కొమరగిరి సామ్రాజ్యం, మైనార్టీ యువజన నాయకుడు ఎండి.గఫార్ ఖాన్, ఆర్ఎంపీ వైద్యులు పి.శ్రీధర్‌తోపాటు పలువురు ఎగ్జిబిట్లను సందర్శించి అభినందించారు. పాఠశాల ప్రధా నోపాద్యాయురాలు పి మేనక, ఉపాద్యాయులు ఎస్ క్రాంతి, సిహెచ్ మాధురి, శ్రీనివాస్, శివకుమార్, వెంకటేశ్వర్లు, పద్మావతి, నజీమ్ అత్తార్,నాగేశ్వర్రావు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
మంగపేట : మండలంలోని ప్రభుత్వ జడ్పీహెచ్ఎస్ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో మంగళవారం జాతీయ సైన్స్ డే సందర్బంగా విద్యార్థులు ఎగ్జిబిట్లతో సందడి చేశారు. మండలంలోని మంగపేట, కమలాపురం, కోమటిపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యా ర్థులు వివిద రకాల ఎగ్జబిట్లను ప్రదర్శించి సందర్శకుల మన్ననలు పొందారు. కమ లాపురం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను మండల ప్రత్యేక అధికారి తుల రవి, ఇంచార్జ్ ఎంపీడీఓ పి శ్రీనివాస్, ఎంఈఓ లకావత్ రాజేష్‌కుమార్ ఎగ్జిబిట్లను సందర్శించారు. అనంతరం కమలాపురం జెడ్పీహెచ్ఎస్ పాఠశాల పదవతరగతి విద్యార్థులకు అందించే స్నాక్స్ పై వారి అభిప్రాయాలు తీసుకున్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించి మెనూ ప్రకారం ఆహారం అందించాలని ఆదేశించారు. మన ఊరు మనబడికి సంబంధించిన నిర్మాణ పనులను ప్రత్యేక అధికారి తుల రవి పరిశీలించారు. నిర్మాణంలోని డైనింగ్ హాల్, హ్యాండ్ వాష్, కలరింగ్ పనులను పరిశీలించి గుత్తేదారుకు సూచనలు చేసి సకాలంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
గణపురం : చెల్పూర్ గ్రామంలోని ఎంజీఎం హైస్కూల్ జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకు న్నారు. విద్యార్థులు వివిధ రకాల 73 సైన్స్ ప్రాజెక్టులు , 52 ఎగ్జిబిట్లు ,విద్యా సాంకేతికత పరిజ్ఞాన విషయాల నాటికలు, నృత్యాలు ప్రద ర్శించారు. పాఠశాల కరస్పాండెంట్ గ్యాదంగి సతీష్, పాఠశాల డైరెక్టర్లు గ్యాదంగి రమాదేవి, సిలువేరు శ్రీనివాస్ ,ప్రిన్సిపల్ మధుకర్, సీనియర్ సైన్స్ ఉపాధ్యాయులు చిర్ర యాకేష్ గౌడ్ సదానందం, రవికుమార్ రేవతి, లక్ష్మి, శ్రీవిద్య తదితరులు పాల్గొన్నారు.
కాటారం : మండల కేంద్రంలోని ఆదర్శ హై స్కూల్లో మంగళవారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వ హించిన సైన్స్ ఫెయిర్ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆదర్శ విద్యా సంస్థల చైర్మన్ జన గామ కరుణాకర్‌రావు పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ శాస్త్రీయ దక్పథాన్ని అలవర్చు కోవాలన్నారు. కరస్పాండెంట్ కార్తీక్ రావు, ప్రిన్సిపాల్ కషిత , ఉపాధ్యాయులు బి ఏ రావు, అనిష్, వెంకట్రాజం పాల్గొన్నారు.
ములుగు : బరిగలపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జాతీయ సైన్స్ దినో త్సవం సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కొత్త పల్లి పోషన్న, సహచర ఉపాధ్యాయులు పోరిక రతన్ సింగ్ ఆధ్వర్యంలో మంగళవారం స్వయం పరిపాలన దినోత్సవం, సైన్స్ ప్రాజెక్టు ల మేళా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తమ సైన్స ప్రాజెక్టులను పాఠశాల ఆవరణలో ప్రదర్శించారు. .ముగింపు సమావేశం ప్రధానోపాధ్యాయులు కొత్త పల్లి పోషన్న అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సర్పంచ్ గరిగ లత నర్సింగరావు బహుమతులు అందజేశారు. వైనాల గీత, సుమలత,ఎల్లమ్మ పాల్గొని విద్యా ర్థులను అభినందించారు.
ములుగు : వెంకటాపూర్ మండలం లోని జడ్పీహెచ్ఎస్ నర్సాపూర్ పాఠశాల లో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు మంగళ వారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సైన్స్ కి సంబంధించిన వివిధ చిత్రాలను ము గ్గుల ద్వారా వేశారు. విద్యార్థులు వివిధ ప్రయోగాలను చేసి ప్రదర్శించిన అనంతరం విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు. ప్రధానోపాధ్యాయులు ఠాకూర్ మంజుల ఉపాధ్యాయులు ఏళ్ళ మధుసూదన్, విమల, ఆజ్మీర సులోచన, సముద్రాల శ్రీనివాసా చార్యులు, బండారి జగదీశ్ పాల్గొన్నారు.