Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
నవతెలంగాణ - వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
యోగాతోనే మానవాళికి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. హార్ట్ ఫుల్ నెస్, శ్రీ రామ చంద్ర మిషన్, సాంస్కతిక మంత్రిత్వ శాఖల అధ్వర్యంలో మార్చి 3, 4, 5వ తేదీలలో ఆర్ట్స్, సైన్స్ కళాశాల లో నిర్వహిస్తున్న యోగ మహౌత్సవ కార్యక్రమం పై ఏర్పాటు చేసిన సంద ర్భంగా పోస్టర్ ను, ఆహ్వాన పత్రాలను మంత్రి, ఇతర అతిథులు ఆవి ష్కరించారు. 3 రోజులపాటు ఉచితంగా శిక్షణ ఇస్తు న్నారు. భారతదేశ అమత మహౌత్సవాల సమాద ర్భంగా ఈ యోగ మహౌత్స వాలను హార్ట్ ఫుల్ నెస్ సంస్థ హర్ దిల్ ధ్యాన్, హర్ దిన్ ధ్యాన్ అనే ని నాదంతో నిర్వహిస్తున్నదని అన్నారు. ఇందులో వి ద్యార్థులు, సామాన్య ప్రజలు ఆహ్వానితులే అన్నారు. వృద్ధులకు కుర్చీల ఏర్పాట్లు చేస్తామన్నారు. మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా మార్చ్ 3వ తేదీన సాయంత్రం 5.30 గంటలకు, 4 వ తేదీన ఉదయం 6.30గంటలకు, తిరిగి సాయంత్రం 5.30గంటలకు నిర్వహి స్తారు. 5వ తేదీ ఉదయం 6.30 గంటలకు, మరలా సా యంకాలం 5.30 గంటలకు నిర్వహిస్తా రన్నారు. అనంతరం ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినరుభాస్కర్ మాట్లాడుతూ యోగా, ధ్యానం వల్ల మనం ఆరోగ్యంగా మారవచ్చని అన్నారు. ఈ కార్యక్ర మంలో కుడా చైర్మన్ సుందర్ యాదవ్,వరంగల్, హనుమకొండ కలెక్టర్ లు డాక్టర్ బి గోపి, సిక్త పట్నాయక్,సీ పీ రంగనాథ్, వరంగల్ నగర పాలక సంస్థ కమిషనర్ ప్రావీణ్య , కాకతీయ యూనివర్సిటీ వీ సీ ప్రోపేసర్ రమేష్,రామచంద్ర మిషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.