Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయప్రతినిధి
స్వచ్ఛ భారత్ లో మరోసారి తెలంగాణ రాష్ట్రం కు దేశంలోనే నెంబర్ వన్ స్థానం దక్కిందని తెలం గాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణా భివద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హన్మకొండ తన క్యాంపు కా ర్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహిం చారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మా ట్లాడారు. స్టార్ త్రీ విభాగంలో తెలంగాణ లోని సిద్ధిపేట జిల్లా, జగిత్యాల జిల్లాలు దేశం లో మొదటి రెండు స్థానాల్లో, మూడో స్థానం లో కేరళ రాష్ట్రం లోని కొట్టాయం జిల్లా నిలి చిందని, స్టార్ ఫోర్ విభా గంలో తెలంగాణ లోని రాజన్న సిరిసిల్ల జిల్లా, 2వ స్థానంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ జిల్లా, 3వ స్థానాన్ని తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా దక్కించుకుందని అన్నారు. ఈ అవార్డులు రావడంలో రాష్ట్ర స్థాయిలో కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారుల నుంచి స్థానికంగా గ్రామ సిబ్బంది వరకు అందరి కషి ఉందన్నారు. ఇందులో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, మార్చి 4న భారత రాష్ట్ర పతి చేతుల మీదుగా ఢిల్లీలో మీనాక్షి అవార్డును అందుకుంటుండటం సంతోషించ దగ్గ విషయం అన్నారు. సీఎం కే సీ ఆర్ కి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కతజ్ఞతలు తెలిపారు.