Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
- తాగునీటి సమస్య లేకుండా చూడాలి
- ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
- రూ. 26.54 కోట్లతో భూపాలపల్లి పట్టణ బడ్జెట్ ఆమోదం
నవతెలంగాణ-భూపాలపల్లి
మునిసిపాలిటీ ఆదాయాన్ని పెంచుకొని పట్టణ అభి వృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మునిసి పల్ పాలకమండలి, సంభందిత అధికారులను కోరారు. మంగళవారం భూపాలపల్లి మునిసిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో మునిసిపల్ చైర్పర్సన్ వెంకట్రాణి సిద్ధు అధ్యక్షతన నిర్వహించిన 2023-24 ఆర్థిక సంవ త్సర బడ్జెట్ ప్రత్యేక సమావేశంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి పాల్గొ న్నారు. ఈ సందర్భంగా 2023 - 24 అంచనా బడ్జెట్ మొత్తం రూ.26.54 కోట్లు ప్రవేశపెట్టగా కౌన్సిలర్లు ఏక గ్రీవంగా ఆమోదించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముని సిపల్ ఆదాయ వనరుల పై కౌన్సిల్ సమావేశంలో చర్చ జరిగి ఆదాయాన్ని పెంచుకునేందుకు దష్టి సారించినప్పుడు తమ వార్డులతో పాటు పట్టణ అభివృద్ధి మరింత ఎక్కువగా జరిగేందుకు అవకాశం ఉన్నదన్నారు. పట్టణంలో ఉన్న ఇంటి పట్టాల సమస్య రాష్ట్ర సబ్ క్యాబినెట్ దృష్టిలో ఉందని, సబ్ క్యాబినెట్ సూచనల మేరకు 12 రకాల భూములలో ఇండ్లు నిర్మించుకున్న 3420 కేసులను త్వరలో పరిష్కరి స్తామని తెలిపారు. ప్రతి వార్డులో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ 100శాతం పన్ను వసూలకు ప్రణాళిక సిద్ధం చేయా లన్నారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ రాబోయే వేసవిలో తాగునీటి ఇబ్బంది కలగకుండా పక డ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. భూపాలపల్లి పట్టణంలో 30 రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి శుభ్రం చేయాలని సూచించారు. మున్సిపాలిటీలో వచ్చే చిన్న చిన్న సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. భూపాలపల్లి మున్సిపల్ కమిషనర్ ప్రతి రోజూ పారిశుద్ధ్య పనులు పర్యవేక్షించాలని కోరారు. భూపాలపల్లి పట్టణం అత్యంత వేగంగా అభివద్ధి చెందుతోందని, ప్రజలకు అవస రమైన మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఇటీవల భూపా లపల్లి పట్టణంలో పర్యటించిన మంత్రి కేటీఆర్ 50 కోట్ల నిధులు ప్రకటించారని, త్వరలో దానికి సంబంధించిన జీఓ విడుదల అవుతుందని అన్నారు. భూపాలపల్లి పట్టణానికి బైపాస్ రోడ్డు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, ఇందుకు సహకరించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మునిసిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ... ఆర్థిక నిధులు పెంచుకునే విధంగా కృషి చేస్తున్నామని, పట్టణ సమగ్రాభివద్ధికి దోహదపడే విధంగా 2023-24 అంచనా బడ్జెట్ ను మీ ముందుకు తీసుకొ చ్చామని, ఆమోదించాలని కోరారు. అంతకుముందు మునిసిపల్ కమిషనర్ పూజారి అవినాష్ 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ఆదాయ, వ్యయాలు వివరించారు. 2023-24లో మునిసిపల్ సొంత రాబడ కింద పన్నుల రూపంలో 5.5 కోట్ల, అద్దెలు, ఫీజుల ద్వారా 3.05 కోట్లు డిపాజిట్, రుణాల ద్వారా 20 లక్షలు, క్యాపిటల్ ప్రాజెక్ట్ నిధులు క్రింద నాన్ ప్లాన్ నిధులు 423 లక్షలు, ప్లాన్ నిధులు 145 లక్షలు, ఇతర నిధులు క్రింద 1210 లక్షలు ఆదాయం అంచనా నమోదు చేశారన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ టి ఎస్ దివాకర్, మున్సిపల్ చైర్ పర్సన్ వెంకట్రాణి, వైస్ చైర్మెన్ కొత్త హరిబాబు, మున్సిపల్ టిఆర్ఎస్ ఫోర్ లీడర్ గండ్ర హరీష్ రెడ్డి కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సబ్యులు, మున్సిపల్ కమిషనర్ అవినాష్, అధికారులు , తదితరులు పాల్గొన్నారు.