Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం
- టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి
నవతెలంగాణ-భూపాలపల్లి
విద్యార్థులు పోరాట పటిమను అలవర్చుకోవాలని, విద్యార్థుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని టీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో జరిగిన హాథ్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా భూపాలపల్లి మండలంలోని కాసింపల్లిలో జిల్లా కేంద్రంలోని విద్యార్థులతో మాట ముచ్చట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూబ కేవలం రాజకీయ నాయ కుల వల్లే తెలంగాణ ఏర్పడలేదని, విద్యార్థుల త్యాగాల పునాదుల పై తెలంగాణ ఏర్పడిందిని స్పష్టం చేశారు. ఆడపిల్లల హాస్టళ్లలో మౌళిక వసతులు లేవని, ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడం వల్ల సర్టిఫికెట్లు తీసుకునేటపుడు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని, పాలనను కేసీఆర్ గలికొదిలే సారని విమర్శించారు. దేశం ఆకలి తీర్చేందుకు హరిత విప్లవం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు .ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిం చిందని, బీడీఎల్, బీహెచ్ఈఎల్, రైల్వే, ఎయిర్ ఇండియా లాంటి సంస్థలు ఏర్పాటు చేసిందని వివరించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభు త్వాలతో మినహాయింపు పొందిన పరిశ్రమల్లో కూడా రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని కాంగ్రెస్ ఆలోచిస్తోందని తెలిపారు. కాంగ్రెస్ అభివద్ధి చేసిన సంస్థలను మోదీ ప్రయివేటుకు అప్పగించారని, లాభాలు వచ్చే సంస్థలను ప్రయివేటు వ్యక్తులకు తక్కువ ధరకే అమ్మే స్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ సంస్థలను ప్రయివేటు పరం చేస్తే.. రిజర్వేషన్లు అమలు జరగదని వివరించారు. కాంగ్రెస్ హ యాంలో రాష్ట్రంలో 30వేల పాఠశాలలు ప్రారంభిస్తే, కేసీఆర్ ప్రభు త్వంలో 6,354 సింగిల్ టీచర్ పాఠాశాలలు మూసేశారని, దీంతో మారుమూల ప్రాంతాల విద్యార్థులకు చదువు దూరమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ యూనివర్సిటీలను కేసీఆర్ ప్రభు త్వం నిర్వీర్యం చేస్తోందని, ప్రయివేటు యూనివర్సిటీలు తెరిచి విద్య ను వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రయివేటు యూని వర్సిటీల్లో రిజర్వేషన్లు ఉండవని,బిశ్వాల్ కమిటీ 1,91,354 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పిందని, కానీ రిటైర్ మెంట్ వయసు పెంచి ఉద్యోగ ఖాళీలను కేసీఆర్ ప్రభుత్వం భర్తీ చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అన్ని విద్యా సంస్థల్లో 25శాతం రిజర్వేషన్ ఇచ్చేలా విద్య విధానం తీసు కొస్తుందని, ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని అమలు చేసి తీర తామన్నారు. 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని, శాఖల వారీగా ఉద్యోగ క్యాలెండర్ ప్రకారం ఖాళీలు భర్తీ చేస్తామని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల కేసులను ఒక్క కలం పోటుతో తొలగిస్తామని, 10శాతం పైగా నిధు లు విద్య కోసం ఖర్చు చేస్తామన్నారు. పరిపాలనలో సమూల మా ర్పులు తెచ్చి హాస్టళ్లను ఆదర్శంగా తీర్చి దిద్దుతామని భరోసాని చ్చారు. రైతుల కోసం కాంగ్రెస్ ఎంఎస్పీ విధానం తీసుకోస్తే.. రాష్ట్ర ప్రభుత్వం ఆ చట్టానికి తూట్లు పొడిచిందని అన్నారు. కాంగ్రెస్ అ ధికారంలోకి రాగానే వరంగల్ డిక్లరేషన్ను అమలు చేసి రైతులను ఆదుకుంటామని తెలిపారు. ఇంటికో ఉద్యోగం అంటే కేసీఆర్ దష్టిలో వాళ్ల ఇంట్లో ఉన్న వాళ్లందరికీ ఉద్యోగాలు ఇచ్చుకునుడుఅని, రాచరికపు పోకడలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. దేశ రాష్ట్ర భవిష్యత్తు విద్యార్థుల చేతిలో ఉందని పేదలకు న్యాయం జరగా లంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణ రావు, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ,జిల్లా పార్టీ అధ్యక్షుడు అయితే ప్రకాశ్ రెడ్డి, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్ లతో కాంగ్రెస్ నాయకులు విద్యార్థులు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.