Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణ రావు
- ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిపై ఛార్జ్ షీట్ విడుదల
నవతెలంగాణ-భూపాలపల్లి
ధరణి పేరుతో స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పేదల భూ ములు లాక్కున్నారని సర్వేనెంబర్ 207,208లో వేసుకున్న షెడ్డులను కూల్చివేశారని, రానున్న ఎన్నికల్లో రాబందు రమణారెడ్డిని ఓడించాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మంగళవారం రేవంత్ రెడ్డి చేపట్టిన హార్ట్ సేహాత్ జోడయాత్ర కార్యక్రమం లో భాగంగా భూపాలపల్లి మున్సిపాలి టీ పరిధి ఖాసింపల్లిలో ఏర్పాటుచేసిన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పై చార్జ్ షీట్ విడుదల చేసి ఆయన మాట్లా డారు. ఎమ్మెల్యే పోలీసులను అడ్డు పెట్టుకుని ఇష్టానుసారంగా వ్యవహరి స్తున్నారని, ప్రశ్నించే వ్యక్తులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రజలను మోసం చేశారని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని లక్షల రూపాయలు దండుకున్నారని ఆరోపిం చారు. అర్హులకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించడానికి 30శాతం కమీషన్ డిమాండ్ చేస్తుండు. పేదలు అంత చెల్లించ లేకపోవడంతో ఇళ్ల కేటాయిం పు ఆపేసిండని ఆరోపించారు. నియో జకవర్గంలో ఎకరాకు కూడా గోదావరి జలాలు తీసుకురాలేకపోయారని అ న్నారు. సింగరేణి, జెన్ కో ఇసుక సేవ్ నిధులు ఇక్కడే ఖర్చు చేయకుండా ఇతర ప్రాంతాల్లో అభివృద్ధికి ఖర్చు పె డుతున్నారని ఆరోపించారు. నియోజ కవర్గంలోని భూములను కబ్జా చేసు డుతో పాటు, శిఖం భూములను కూడ ఎమ్మెల్యే గండ్ర ఆక్రమిస్తుండని, ఈ భూములను ప్లాట్లుగా చేసి అమ్ము కుంటుండని ఆరోపించారు. అక్రమం గా బొగ్గు, ఇసుక మైనింగ్ చేస్తు, రియల్ ఎస్టేట్ దందాలతో పాటు, కల్తీ పెట్రోల్ అమ్మి రూ.కోట్లు దోచుకుం టున్నాడని ఆరోపించారు. భూపాల పల్లి పట్టణంలో అంబేద్కర్ చౌక్ నుంచి జంగేడు, కాసింపల్లి, కష్ణా కాలనీల వరకు సెంట్రల్ లైటింగ్, 4 లైన్ల రహదారి పనులకు శంకుస్థాపన చేసి మరిచిపోయిండని, రూ.30 కోట్ల నిధులు మంజూరైనట్టు చెప్తున్నా, పనులు మాత్రం జరగడం లేదని ఆరోపించారు.బీఆర్ఎస్ పార్టీలో చేరి ప్రజలకిచ్చిన హామీలు తుంగలో తొక్కాడని, చిట్యాల, భూపాలపల్లిలో మార్కెట్ యార్డులు నిర్మించలేదన్నారు. భూపాలపల్లి జిల్లాలో కలెక్టర్ భవన సముదాయం నిర్మించేందుకు కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు అడుగుతుండని, దీంతో భవనాన్ని పూర్తి చేసేందుకు ఎవరు ముందుకు రావడం లేదని ఆరోపిం చారు. జిల్లా కేంద్రంలో ఉన్న వంద పడకల ఆసుపత్రి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో సిటీ స్కాన్లాంటి పరిక రాలతో డయాగ్నొస్టిక్ సెంటర్ ఏర్పా టు చేస్తమని చెప్పి మోసం చేశాడ న్నారు. సింగరేణి ఏరియాలోని ఆసు పత్రిలో నిపుణులైన వైద్యులు లేకపోవ డంతో కార్మికులు ప్రైవేటు వైద్యం చే యించుకోవాల్సి వస్తుందని తెలిపారు. భూపాలపల్లి లోని కేటీకే 8 గనిని ప్రైవేటీకరణ చేయోద్దంటూ ఎమ్మె ల్యేకు కార్మికులు ఎన్నిసార్లు విన్నవిం చినా పట్టించుకోవడంలేదని ఆరోపిం చారు. ఈ కార్యక్రమంలో వరంగల్ మాజీ ఎంపీలు సిరిసిల్ల రాజయ్య, మల్లు రవి, అంజనీ కుమార్, పీసీసీ సభ్యులు చల్లూరి మధు, ఎస్సీ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ దూడపాక శంకర్, ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ దండు రమేష్, ఎస్టి సెల్ జిల్లా చైర్మన్ పోరిక సమ్మ య్యనాయక్, నాయకులు దేవాన్, కొమురయ్య, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.