Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -హనుమకొండ చౌరస్తా
మేర కులస్తులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం నిలు స్తోందని ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. హనుమకొండ నగరంలో మంగళవారం టైలర్స్ డే ఘ నంగా నిర్వహించారు. దాస్యం వినరుభాస్కర్ పాల్గొని మేర కులస్తుల జెండా ఎగరేశారు. అనంతరం మేర కుల స్తులను సన్మానించి ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కులవృత్తులన్నింటికీ ఆత్మగౌరవ భవనాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా హన్మకొండ నగరంలో మేర కులస్తులకు కమిటీహల్ మంజూరు చేశా మన్నారు. కరోనా కష్టకాలంలో మేరకులస్తులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశామన్నారు. మేర కులస్తుల ఆర్థిక పరిపుష్టికి సొసైటీ ఏర్పాటు చేశామన్నారు. ఆ సంఘంలో 300మంది ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ పరంగా కూడా మేర కులస్తులను ఆదుకునేందుకు పాఠశాలల విద్యార్థుల యూనిఫాంలు కుట్టే కాంట్రాక్ట్ ఇప్పించేందుకు కృషి చేస్తా అని అన్నారు. వృత్తిపరమైన మెళకువలు నేర్పిస్తామని తెలి పారు. ఈ కార్యక్రమంలో మేర వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పొడిశెట్టి అనిల్‌కుమార్,ట్రస్ట్ అధ్యక్షులు గూడూరు వెంకటేశ్వర్లు,ట్రస్ట్ ముఖ్య సలహాదారులు గూడూరు సతీష్ కుమార్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి సంఘ వెంకట్రాజం,ట్రస్ట్ ఉపాధ్యక్షులు రామగిరి రాజు,మేర వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కీర్తి జయంత్, రాయబాపు, సంతోష, తదితరులు పాల్గొన్నారు.