Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
ఇనుగుర్తి మండల కేంద్రంలో రైతు వేదిక యందు యాసంగి సీజన్లో ఇను గుర్తి గ్రామ సర్పంచ్ దార్ల రామ్మూర్తి అధ్యక్షతన నిర్వహించిన రైతు శిక్షణ కార్యక్ర మానికి ముఖ్యఅతిథిగా జిల్లా వ్యవసాయ అధికారి బి.చత్రునాయక్ హాజరై రైతు లకు పలు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది.ఈసందర్భంగా మాట్లాడుతూ రైతు సోదరులు మూస పద్ధతులను వ్యవసాయంలో విడనాడి ఆధునిక పంటల సాగు వైపుకు మగ్గుచూపాలని అదేవిధంగా ఆయిల్ ఫామ్ పంట వైపు అడుగు వేయాలని వారు కోరారు. ఆయిల్ ఫామ్ పంటకు ప్రభుత్వము సబ్సిడీ మీద మొక్కలకు అదేవిధంగా డ్రిప్పు పరికరాలకు సబ్సిడీ ఇస్తున్నందున రైతు సోదరులు ఆయిల్ ఫామ్ పంట వైపు మొగ్గు చూపాలని కోరారు. అదేవిధంగా నాలుగు సంవత్సరాల వరకు అంతర పంట సాగు చేసుకోవడానికి ఎరువులకు ఎకరానికి 4200 సబ్సిడీ ఇస్తుంది. ఆయిల్ ఫామ్ పంట 30 సంవత్సరాల వరకు సాగు చేసుకోవచ్చని నాలుగో సంవత్సరం నుండి పంట చేతికి అందుబాటులోకి వస్తుం దని ఈ పంటకు కోతుల బాధ ఉండదని వారు వివరించారు.
అదేవిధంగా రైతులు యాసీన్ సీజన్లో సాగుచేసిన పత్తి, వరి పంట క్షేత్రాలను సందర్శించి వాటిలో వచ్చే పురుగులు నివారణ చర్యల గురించి రైతులకు శిక్షణ ఇవ్వడం జరిగింది, ఈరోజు శిక్షణ కార్యక్రమంలో భాగంగా వరిలో సమగ్ర ఎరువు ల యాజమాన్యం మీద సూక్ష్మ పోషకాల యాజమాన్యం మీద రైతులకు పూర్తి స్థాయిలో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సమావేశం అనంతరం గౌరవ జిల్లా వ్యవసాయ అధికారి సర్పంచ్ ఆధ్వర్యంలో రైతుబంధు సమితి క్యాలెం డర్లను రైతులకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బి.వెంకన్న, వ్యవసాయ విస్తరణ అధికారి టి.మురళీ, ఆత్మ నెంబర్ కర్ర నరసింహారెడ్డి, ఎంపీటీసీ, రైతులు తదితరులు పాల్గొన్నారు.