Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
గత పాలకుల హయంలో అన్ని రగాలుగా వెనుకబడిన గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి అన్ని రంగాలలో అబివృద్ధి చేయడమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం అని ఎంపిపి మూడ్ శివాజీ చౌహాన్, సర్పంచ్ గంగా వత్ రుక్మిణీలు అన్నారు. మండల పరిధిలోని చిన్న కిష్టాపురం పంచాయతీ దేశ్యా తండాలో ఎన్ఆర్ఈజిఎస్ నిధులతో నిర్మించనున్న సిసి రోడ్లకు గురువారం శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన తండాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సియం కేసీఆర్ సహకారంతో ఎమ్మెల్యే బానోత్ హరిప్రియా శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బిక్యా అనసూర్య, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగావత్ లక్ష్మణ్ నాయక్, పంచాయతీ కార్యదర్శి సరిత, గ్రామ పెద్దలు గంగావత్ హరి కిషన్, జి. అశోక్, శేషయ్య, హచ్యా, మాన్ సింగ్, లోక్య తదితరులు పాల్గొన్నారు.