Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధర్మసాగర్
ఓపెన్ జిమ్మును గ్రామ ప్రజలు ఉప యోగించుకొని ఆరోగ్యవంతంగా ఉండాల ని సర్పంచి ఎర్రబెల్లి శరత్ అన్నారు. గురువారం రిజర్వాయర్(చెరువు) దగ్గర నూతనంగా ఏర్పాటు చేయనున్న ఓపెన్ జిమ్ పనులను ఆయన పరిశీలించి, మా ట్లాడారు. ఓపెన్ జిమ్ పనులు అన్నీ దాదాపు పూర్తి అయ్యాయని, త్వరలోనే ప్రారంభోత్సవం జరుపుతామని, గ్రామస్థులు అందరూ, ముఖ్యంగా యువత ఉద యం, సాయంత్రం సమయాలలో ఓపెన్ జిమ్ని ఉపయోగించుకొని అనారో గ్యాలకు దూరం కావాలని, దిన చర్యలో వ్యాయామం ఒక భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు.