Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే అరూరి సమీక్ష
నవతెలంగాణ-పర్వతగిరి
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలి అని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ సూచించారు. మండల ప్రజా ప్రతినిధులు, అధికారులతో హన్మకొండ హంటర్ రోడ్డులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్సమీక్షా సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా మండలంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరుపై ఎమ్మెల్యే వారితో చర్చించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి పనుల విషయంలో అలసత్వం వహించవద్దని అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వ యంతో పని చేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో జడ్పీటిసి బానోత్ సింగు లాల్, మాజీ జడ్పీటిసిలు మేడిశెట్టి రాములు, లునావత్ పంతులు నాయక్, వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు, తక్కలపెల్లి నారాయణ రావు, భాస్కర్ రావు, మండల పార్టీ అధ్యక్షుడు రంగు కుమార్, నాయకులు జితేందర్ రెడ్డి పాల్గొన్నారు.