Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్
నవతెలంగాణ-వరంగల్
మహిళల పట్ల ఏవరైన అసభ్యకరంగా ప్రవర్తిస్తే షీ టీం పోలీసులు తక్షణమే స్పందించి మహిళల భద్రతపై ప్రజలకు భరోసా కలిగించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్, షీ టీం పోలీసులకు పిలుపు నిచ్చారు. వరంగల్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా వరంగల్ పోలీస్ కమిష నర్ షీ టీం కార్యాలయంతో పాటు అర్బన్ మహిళా పోలీస్ స్టేషన్‌ను గురువారం సందర్శించారు. గురువారం ఉదయం వరంగల్ రంగంపేటలోని షీ టీం కార్యాల య పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఈ విభాగంలో పనిచేస్తున్న అధికా రులు, సిబ్బంది వారు ప్రస్తుతం నిర్వర్తిస్తున్న విధులను పోలీస్ కమిషనర్ సంబం ధిత అధికారులను అడిగితెలుసుకోవడంతో పాటు ప్రస్తుతం షి టీమ్ ఎర్పాటు అయినాటి నుండి ఈ విభాగం కార్యకలపాలను అడిగితెలుసుకున్నారు. ఈ సంద ర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం మహిళల భద్రత కోసం పోలీస్ యూనిట్ల వారిగా ఏర్పా టైన షీ టీం విభాగం మరింత బలోపేతం చేయడంలో ప్రతీ పోలీస్ అధికారిపై వుందని, మహిళల పట్ల జరిగే లైంగిక వేధింపులపై తక్షణమే స్పందించాలని, తమ సమస్యలను తెలియజే సేందుకు మహిళలు స్వచ్చందంగా షీ టీం బృందాలకు సమాచారం అందించే విధంగా వారిలో నమ్మకాన్ని కలిగించాలని, షీ టీం విభాగానికి అధిక సంఖ్యలో ఫిర్యాదులు వచ్చినప్పుడే ఈ విభాగం ద్వారా న్యాయం జరుగుతుందనే నమ్మకం ప్రజల్లో కలుగుతుందని, ముఖ్యంగా రాష్ట్రంలో రెండవ అతి పెద్ద నగరమైన వరం గల్ కమిషనరేట్‌లో శాంతి భద్రతల నియంత్రణలో భాగంగా రాబోవు రోజుల్లో షీ టీం విభాగాన్ని మరింత బలోపేతం చేయడం జరుగుతుందని. ఇందుకోసం ప్రత్యే క ప్రణాళికలను రూపొందించడం జరిగిందని, అలాగే షీటీం కార్యకలాపాలపై ఎక్కువ ప్రచారం చేయాల్సిన అవసరం వుందని, ముఖ్యంగా మహిళలపై లైంగిక దాడులు, అసభ్యకరంగా ప్రవర్తించే వారిపట్ల కఠినంగా వ్యవహరిం చాలని, ఎలాం టి పైరవీలకు అవకాశం ఇవ్వద్దన్నారు. అలాగే మహిళలు ఎలాంటి లైంగిక దాడుల కు గురవుతున్న తక్షణమే షీటీం విభాగం సెల్‌నంబర్ 8712685142, 8712685270 నంబర్లకుగానీ లేదా వరంగల్ పోలీస్ కమిషనరేట్ వాట్సప్ నంబర్ 8712685257కు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా వుంచబడుతాయని పోలీస్ కమిషనర్ ప్రజలకు తెలి పారు. పోలీస్ కమిషనర్‌తో పాటు క్రైమ్స్ డిసిపి మురళీధర్, అదనపు డిసిపి పుష్పారెడ్డి, క్రైమ్ ఏసిపి డేవిడ్ రాజు, టాస్క్ ఫోర్స్ ఏసిపి జితేందర్‌రెడ్డి, షీం టీం ఇన్స్పెక్టర్ సంజీవ్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఉస్మాన్ షరీఫ్, సైబర్ క్రైం ఇన్సెస్పెక్టర్ జనార్థన్ రెడ్డి, భరోసా ఇంచార్జ్ ఇన్స్పెక్టర్ సువర్ణ పాల్గొన్నారు.