Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చెన్నారావుపేట
పెంచిన గ్యాస్ ధర వెంటనే తగ్గించాలని బీఆర్ ఎస్ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు చెన్నారావుపేట మండల కేంద్రంలోని నెక్కొండ-నర్సంపేట ప్రధాన రహదారిపై నిరసన కార్యక్రమంను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయ కులు మాట్లాడుతూ సామాన్యులకు గ్యాస్ ధరలు పెంచి నడ్డివిరగా గొడుతున్న కేంద్ర ప్రభుత్వం వెం టనే గ్యాస్ సిలిండర్ ధరలను విరమించుకోవాలని లేని యెడల బీఆర్ఎస్, ప్రజా సంఘాల నాయకులు ఆధ్వర్యంలో రాబోయే ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పుతామన్నారు. ఈ కార్యక్రమం లో జెడ్పీటిసి బానోతు పత్తి నాయక్, జిల్లా కోఆప్షన్ సభ్యులు మహ్మద్ రఫీ, మాజీ ఎంపీపీ జక్క అశోక్, మాజీ జడ్పీటిసి జున్నుతుల రాంరెడ్డి, మండల యువ నాయకులు కంది కృష్ణ చైతన్య రెడ్డి, మండల నాయ కులు బద్దునాయక్, ఉపసర్పంచ్ కందికొండ విజరు, ఎస్సీసెల్ గ్రామ అధ్యక్షులు నర్మెట సాంబయ్య, మం డల యూత్ నాయకులు మూడు రమేష్, సోషల్ మీ డియా మండల ఇంచార్జి బోడ మురళి నాయక్, తది తరులు పాల్గొన్నారు.
పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి
కార్పొరేటర్లు స్వర్ణలత భాస్కర్, నరేంద్ర కుమార్
కాశిబుగ్గ : కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని 19, 20వ డివి జన్ల కార్పొరేటర్లు ఓని స్వర్ణలత భాస్కర్, గుండేటి నరేంద్ర కుమార్ డిమాండ్ చేశారు.పెరిగినగ్యాస్ ధర లకు నిరసనగా గురువారం కాశిబుగ్గ చౌరస్తాలో 19, 20వ డివిజన్ల కార్పొరేటర్లు స్వర్ణలత భాస్కర్, నరేం ద్ర కుమార్ల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేప ట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గ్యాస్ ధర పెంపు ప్రభావం ఇతర నిత్యవసర సరుకులపై పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బా ల్నే సురేష్, మాజీ కార్పొరేటర్ బయ్య స్వామి, ఆర్టిఏ సభ్యుడు గోరంట్ల మనోహర్, నాయకులు భూక్య మో తిలాల్ నాయక్, నూకల రాణి, వేముల నాగరాజు, చందు, గంగాధర్, ఇక్బాల్, రాజు, రమేష్, సోను, ప వన్, బాలరాజు, సాంబయ్య, సారంగపాణి, కొముర య్య, తదితరులు పాల్గొన్నారు.
గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ధర్నా
మహబూబాబాద్ : కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మహ బూబాబాద్ పట్టణంలోని నెహ్రూ సెంటర్లో గురు వారం ధర్నా నిర్వహించారు.ఈకార్యక్రమంలో ఎమ్మె ల్యే బానోత్ శంకర్ నాయక్ మాట్లాడారు. కేంద్ర ప్ర భుత్వం రోజుకోసారి గంటకోసారి పెట్రోల్ ధరలు గ్యాస్ ధరలు పెంచుకుంటూ పోతుందని విమర్శిం చారు. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియగానే గ్యాస్ ధరలు పెంచడం పరిపాటిగా మారిందని అ న్నారు. దేశంలో ఒక పక్క ఒకటో తేదీ నుంచి 8వ తేదీ వరకు మహిళా దినోత్సవాలు జరుగుతుండగా మహిళలకు ధనాభారం మోపడం శోచనీయమన్నా రు. గ్యాస్ ధరల పెంచుతుండడంతో వంటింటి బడ్జెట్ అతలాకుతలం అయిందన్నారు.గ్యాస్ ధరలతో పాటు రేపు పెట్రోల్ వడ్డన కూడా ఉంటుందని ఆం దోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ఇంటికి పంపాల్సిందేనని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డా.పాల్వాయి రాంమోహన్ రెడి, వైస్ చైర్మన్ ఫరీద్, రాష్ట్ర నాయ కులు మార్నేని వెంకన్న, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు గద్దె రవి, గోగుల రాజు, పిఏసీఎస్ చైర్మన్ నాయిని రంజిత్, సూదగని మురళి, లునవత్ అశోక్, గుండా రాజశేఖర్,బాలునాయక్, కౌన్సిలర్లు, బిఆర్ఎస్ నాయ కులు, మహిళా నాయకులు పాల్గొన్నారు.