Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలి అని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సమ్మె ట రాజమౌళి డిమాండ్ చేశారు. గురువారం మాను కోటలో సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించిచారు. కేంద్ర ప్రభుత్వం పెం చిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నర్సంపేట బైపాస్‌లో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేసి ధర్నా నిర్వహించారు. ఈ సంద ర్భంగా సిలివేరి వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించి న సమావేశంలో సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యు లు సమ్మెట రాజమౌళి మాట్లాడుతూ కేంద్ర ప్రభు త్వం ఇప్పటికి 14 సార్లు గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధర లను పెంచి పేదలపై మోయలేని భారం వేస్తుందని ధ్వజమెత్తారు, ఒకపక్క ప్రభుత్వ రంగ సంస్థలను ప్రై వేటు వ్యక్తులకు అమ్ముతూ నిరుద్యోగాన్ని పెంచి పోషి స్తుందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల సీపీఎం ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్య మాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శివర్గ సభ్యు లు రావుల రాజు, పాలబిందల మల్లన్న, చీపిరి యాక య్య, ఏటిగడ్డ తండా కార్యదర్శి భానోత్ ప్రకాష్, మోతిలాల్, శ్రీను, వీర్ెే, మహిళలు పాల్గొన్నారు.
బీసీపీఐ (ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో...
తొర్రూరు : పెంచిన వంట గ్యాస్ ధరలను వెం టనే తగ్గించాలని సీపీఐ (ఎం) జిల్లా కమిటీ సభ్యులు బొల్లం అశోక్ డిమాండ్ చేశారు. గురువారం తొర్రూ రు డివిజన్ కేంద్రంలోని మున్సిపల్ రోడ్డు కూడలిలో తొర్రూరు సీపీఐ (ఎం) మండల కార్యదర్శి మహమ్మద్ యాకూబ్ ఆధ్వర్యంలో పెంచిన వంట గ్యాస్ ధరలు తగ్గించాలని, రోడ్డుపై సిలిండర్‌తో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బొల్లం అశోక్ మాట్లాడారు. బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధా నాలతో సామాన్య, మధ్యతరగతి పేదప్రజలకు మో య లేని భారాన్ని కేంద్ర ప్రభుత్వం మోపుతుందని వా రు ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాడు 400 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిం డర్ ధర నేడు 1150 రూపాయలకు పెరగడం సా మాన్య ప్రజలకు షరాఘాతంగా మారిందన్నారు. పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాల ని, లేకపోతే గత ప్రభుత్వాలకు పట్టిన గతే ఈ ప్రభు త్వానికి పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్ర మంలో సీపీఐ (ఎం) నాయకులు డొనుక దర్గయ్య, పస్తం భాస్కర్, యనమల క్రాంతి, పున్నం సారయ్య, వెంకన్న, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.
గ్యాస్ ధర పెంపు పై ప్రజాపంథా నిరసన
త్రిపుర, మేఘాలయ తదితర రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం 50 రూపాయల గ్యాస్ ధర పెంచటానికి నిరసిస్తూ సిపిఐ (ఎంఎల్) ప్రజాపంథా ఆధ్వర్యంలో తోర్రూర్ గాంధీ సెంటర్లో గ్యాస్ సిలిండర్‌తో నిరసన తెలిపారు.ఈ సందర్భం గా ప్రజాపంథా డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రవి మా ట్లాడుతూ గ్యాస్ కంపెనీల లాభాల కోసం కేంద్ర ప్రభుత్వం 50 రూపాయలు ఒక్కొక్క సిలిండర్ పై పెంచడం అన్యాయమన్నారు.కేంద్ర ప్రభుత్వం మోపు తున్న ఆర్థిక భారాలకు వ్యతిరేకంగా ప్రజానికం పెద్ద ఎత్తున వీధుల్లో కొచ్చి ఉద్యమించాలని అందుకు సిపిఐ (ఎంఎల్) ప్రజాపంథా నాయకత్వం వహిస్తుం దని తెలిపారు. అనంతరం ప్రజాపంధ తొర్రూర్ సబ్ డివిజన్ కార్యదర్శి ముంజంపల్లి వీరన్న మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ చర్యలను ప్రతి ఒక్కరు ఖండించాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ నాయకులు చింతా నవీన్, ఐఎఫ్టియు నాయకులు బంద్ శ్రీను, పిడిఎస్యు జిల్లా నాయకులు శేఖర్, జావిద్, రైతు సంఘము నాయకులు వెంకటయ్య, మురళి, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
గ్యాస్ ధరల పెంపుకు నిరసనగా దిష్టిబొమ్మ దగ్ధం
జఫర్గడ్ : ప్రజలపై భారాలు మోపుతున్నా మో డీ గద్దె దిగాలి... గ్యాస్ ధరలు పెంచడమేనా బీజేపీ భరోసా అంటే... సీపీఐ జిల్లా కార్యదర్శి మాజీ సిహెచ్.రాజారెడ్డి అన్నారు. గ్యాస్ ధర పెంపును నిర సిస్తూ గురువారం సీపీఐ ఆధ్వర్యంలో మండల కేం ద్రంలో మోడీ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఈ కార్య క్రమానికి మండల కార్యదర్శి జువారి రమేష్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా రాజారెడ్డి పాల్గొని మాట్లా డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేము అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామని చెప్పి అధికా రంలోకి వచ్చాక ధరలు తగ్గించకుండా రెండింతలు పెంచి డబ్బున్న సంపన్నులు పయనించే విమానాల చమురు ధరలు తగ్గించడం ప్రజలను మోసం చెయ్య డమేనన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించడా నికి సీపీఐ కార్యకర్తలు నడుంబిగించలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొమ్మి నేని వెంకట్ రెడ్డి, బికెఎంయు జిల్లా అధ్యక్షులు మండ ల గట్టుమల్లు, నాయకులు యాకుబ్ పాషా, మంద బచ్చయ్య, జాఫర్, అజ్జురి వెంకన్న, రాడపక ప్రకాష్, కలకోట ప్రభాకర్, శోభ, వెంకటయ్య, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.
గార్ల : బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి గ్యాస్ ధరలు రోజురోజుకు పెంచుకుం టూ పోతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్ అన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచడానికి నిరసిస్తూ సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు లో భాగంగా మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక నెహ్రూ సెంటర్లో గురువారం ఖాళీ సిలిండర్లను ప్రదర్శిస్తూ వినూత్న రీతిలో ఆందోళన నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో వంట గ్యాస్ ధరల పెరు గుదలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని ఆవేద న వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కె. మహేశ్వరావు, సిపిఎం నాయకులు వెంకటరెడ్డి, శ్రీని వాస్,సంగు నాగరాజు, పవన్, ఎల్లయ్య, రాము, ప్రవీ ణ్, నవీన్, రమేష్ తదితరులు ఉన్నారు.
బయ్యారం : పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ పిఓడబ్ల్యు, పివైఎల్ ఆధ్వర్యం లో గురువారం మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్ర మాన్ని ఉద్దేశిస్తూ పిఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి ఊకె పద్మ, పివైఎల్ రాష్ట్ర నాయకులు తుడుం వీరభద్రం లు మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు విపరీ తంగా పెరిగి ప్రజలు అల్లాడుతుంటే మరోసారి ఐదు నెలలు పూర్తికాక ముందే గ్యాస్ పై 50 రూపాయలు పెంచడం వల్ల సామాన్య ప్రజల పై మోయలేని భా రం పడుతుందని వారు విమర్శించారు. ఈ కార్యక్ర మంలో పిఓడబ్ల్యు రాష్ట్ర నాయకులు తుడుం అను రాధ, వార్డు మెంబరు జినుక రేణుక, పివైఎల్ నాయ కులు లక్ష్మీనారాయణ, మహేష్, మురళి, శేషు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలపై భారము మోపడం సిగ్గుచేటు
చెన్నారావుపేట : గ్యాస్ ధరలు పెంచి పేద ప్రజ లపై కేంద్ర ప్రభుత్వం భారం మోపుతున్నారని తెలం గాణ వ్యవసాయ కార్మిక సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు నవీన్‌ల స్వామి అన్నారు. మండల కేంద్రం లోని లింగగిరి గ్రామంలో గురువారం నిరసన ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. అనంతరం జిల్లా అధ్య క్షులు నవీన్‌ల స్వామి మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి పేద, మధ్యతరగతి ప్రజలపై అనేక రూపాలలో భారాలు మోపుతోందన్నారు. పెంచిన గ్యాస్, నిత్యవసర సరు కుల ధరలు తగ్గించకుంటే ప్రజలు సరైన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసా య కార్మికసంఘం మండల ప్రధాన కార్యదర్శి మొగు లోజు శారద, పసునూటిస్వామి, ఉపాధ్యక్షులు పో గుల అశోక్, అలివేలు కట్టమ్మ, రమ,సునీత, సుమల త, మాధవి, కోమల, సరిత, భవాని పాల్గొన్నారు.
పెంచిన గ్యాస్ ధరను కేంద్రం తగ్గించాలి...
మట్టేవాడ : గ్యాస్ ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం పేదలపైన పెనుభారాన్ని వేస్తుందని సిపిఐఎం రంగసాయిపేట ఏరియా కార్యదర్శి మా లోత్ సాగర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం విని యోగదారుల గ్యాస్ సిలిండర్ పై 50 రూపాయలు పెంచిన నేపథ్యంలో పెంచిన ధరను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం రంగసాయిపేట ఏరియా కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఆర్టిఏ జంక్షన్ వద్ద రాస్తా రోకో చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి పేద మధ్య తరగతి ప్రజలపై అనేక రూపాలలో అనునిత్యం మోయలేని భారాలను వేస్తుందని అన్నారు. బిజెపి ప్రభుత్వం చేపట్టక ముందు 410 రూపాయలు ఉన్న గ్యాస్ బుడ్డి ధర నేడు 1200 రూపాయలకు చేరువైందని అన్నారు. బిజెపి ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పే రోజు లు దగ్గర పడ్డాయని అన్నారు. పెంచిన గ్యాస్ నిత్యవ సర సరుకుల ధరలు తగ్గించకుంటే ప్రజలు సరైన స మయంలో గుణపాఠం చెప్పడం తధ్యమని హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో రంగసాయిపేట ఏరియా కమిటీ సభ్యులు మాలోతు ప్రత్యూష, గానేపాక ఓదే లు, సాంబమూర్తి, జ్యోతి, లక్క రమేష్, గజ్జ చందు రామ సందీప్, అల్లాడి యాకయ్య, జి లక్ష్మణ్, శ్యామ్, ఈసంపల్లి సతీష్, తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం
జనగామ : పెంచిన గ్యాస్ నిత్యవసర వస్తువులు ధరలు తగ్గించకుంటే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్ప దని సిపిఎం జనగామ పట్టణ కార్యదర్శి జోగు ప్రకా ష్ అన్నారు. గురువారం పెంచిన గ్యాస్ నిత్యవసర ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నెహ్రూ పార్క్ సెంటర్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దాహనం చేసి రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జోగు ప్రకా ష్ మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్ 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 410 రూపాయలు ఉన్నటువం టి గ్యాస్ సిలిండర్ ధర బిజెపి ప్రభుత్వం ఇప్పుడు 1155 రూపాయలకు పెంచిందన్నారు. కేంద్రం ప్రజల కష్టాలను పట్టించుకోకుండా ధరలను పెంచ డం కేంద్ర ప్రభుత్వం చేతగానితనం అని అన్నారు. వెంటనే పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు పోరాటాలు చేస్తామని వారుహెచ్చరించారు.ఈకార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సుంచు విజేందర్, పట్టణ కమిటీ సభ్యులు కళ్యాణం లింగం, మంగ బీరయ్య, పందిళ్ళ కళ్యాణి, సిపిఎం నాయకులు దూసరి నాగరాజు,ఎండి గౌసియా, బూడిది అంజమ్మ, కొండ వరలక్ష్మి, పొన్నా ల ఉమా, భాషపాక విష్ణు, మారేడు వినోద్, రాజు, ఎండి మునీర్, వెంకటేష్, కొన్ని శాంత, భాగ్య, నాజి యా, లక్ష్మి, మనీలా తదితరులు పాల్గొన్నారు.