Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని వైస్ ఎంపీపీ బడితేల స్వరూపరాజయ్య ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళ దినోత్స వాన్ని పురస్కరించుకుని గురువారం మండలంలో రుద్రారం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అంగన్ వాడీ సూపర్వైజర్ సరస్వతి ఆధ్వర్యంలో మహిళ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళ స్వశక్తి సంఘం జిల్లా కోఆర్డినేటర్ అనూష, అంగన్ వాడి మహాదేవపూర్ సీడీపీఓ రాధిక మాట్లా డారు. మహిళల పట్ల లింగ వివక్ష తగదన్నారు. మహిళలపై జరిగే హింసలను అరికట్టాలని పిలుపునిచ్చారు. మహిళల హక్కులను తెలుసుకొని వినియోగించు కోవాలన్నారు. ఆపద సమయంలో 181, 100,1098,1056టోల్ ప్రి నెంబర్లకు ఫోన్ చేయాలన్నారు. అనంతరం చిన్నారులతో నత్యాలు, పాటలు పలువురుని అలరించారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడి టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.