Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధర్మసాగర్ సీఐ ఒంటేరు రమేష్
నవతెలంగాణ-ధర్మసాగర్
ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, లేదంటే కఠిన చర్యలు ఉంటాయని ధర్మసాగర్ సీఐ ఒంటేరు రమేష్ అన్నారు. గురువారం మండలంలోని తాటికాయల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆదర్శ ఆటో యూనియన్ బోర్డును సీఐ ఆవిష్కరించారు .ఈ సందర్బంగా ఆటోలకు టాప్ నెంబర్లు కేటాయించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ఆటోలో ప్యాసింజర్లను ఎక్కించుకోవద్దని, మద్యం సేవించి వాహనాలు నడుపరాదని హెచ్చరించారు. డ్రైవర్లు డ్రైవింగ్ లైసెను తో పాటు,బండి కాగి తాలు కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ ఆటో యూని యన్ అధ్యక్షులు కనుకటి రవీందర్,ఉపాధ్యక్షులు పెసరు రమేష్ ,ప్రధాన కార్యదర్శి ఎర్ర రాజు, నారాజాయింట్ సెక్రటరీ పెసరు యాదగిరి , కోశాధికారి కమాలొద్దీన్,డ్రైవర్లు శంకర్, రజిని కుమార్ ,అనిల్, తదితరులు పాల్గొన్నారు.