Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
మండలంలోని కొయ్యుర్ గ్రామంలో ప్రధాన కూడలి వద్ద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 85వ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితల రాజయ్య ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు,పండ్లు పేదలకు పంచారు. అనంతరం శ్రీపాదరావు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు రేఖల్ని నింపి సమానత్వానికి జీవం పోసిన మహనీయుడు శ్రీపాదరావుని కొనియాడారు. మంథని మారుమూల ప్రాంతంలో అనేక అభివృద్ధి పనులు చేసి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన మహానుబావుడన్నారు. ఎంపిపి చింతలపల్లి మల్హర్రావు, జెడ్పీటీసీ అయిత కోమల రాజిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ కొండ రాజమ్మ, సింగిల్ విండో డైరెక్టర్లు ఇప్ప మొండయ్య,వొన్న తిరుపతి రావు,రమేష్ రెడ్డి, సంగ్గెం రమేష్, సర్పంచ్లు శనిగరం రమేష్, జనగామ బాపు, ఎంపీటీసీలు నాగరాని లక్ష్మీ నారాయణ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మత్సశాఖ కార్యదర్శి జంగిడి శ్రీనివాస్, ఎస్సి సెల్ భూపాలపల్లి అధ్యక్షుడు దండు రమేష్, ఎస్సి సెల్ మండల అధ్యక్షుడు రాజ సమ్మయ్య, పాల్గొన్నారు.
మహదేవపూర్ : మహాదేవపూర్ మండల కేంద్రంలో దుద్దిళ్ళ శ్రీపాదరావు జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కాంగ్రేస్ పార్టీ మండల అధ్యక్షులు అక్బర్ ఖాన్, జెడ్పీటీసీ అరుణ శ్రీనివాస్, యూత్ కాంగ్రేస్ అధ్యక్షులు కట్కం అశోక్, బ్లాక్ కాంగ్రేస్ అధ్యక్షులు కోట రాజబాపు, ఎంపీటీసీ ఆకుతోట సుధాకర్, ఎస్టీ సెల్ అధ్యక్షులు పిట్టల చంద్రమౌళి, సీనియర్ కాంగ్రేస్ నాయకులు వామన్ రావు, రామ్ మోహన్ రావు,హబీబ్ ఖాన్, చెన్నూరి వెంకటయ్య, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
కాటారం : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను కాటారం మండల కేంద్రం లో ఘనంగా నిర్వహించారు. చింతకాని క్రాస్ రోడ్లో గల శ్రీపాద రావు కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం, కేక్ కట్ చేసి స్వీట్లు పండ్లు పంపిణీ చేచారు. శ్రీపాదరావు ఆశయాలను కొనసాగిస్తామన్నారు. ఎంపీపీ పంతగాని సమ్మయ్య, పార్టీ అధ్యక్షుడు వేముల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మహిళా మండలం అధ్యక్షురాలు ఎంపిటిసి జాడి మహేశ్వరి రమేష్, ఎంపీటీసీ రవీందర్ రావు, మాజీ జెడ్పిటిసి ఆంగోత్ సుగుణ, డిసిసి ఉపాధ్యక్షులు గద్దె సమ్మిరెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి కుంభం స్వప్న రమేష్ రెడ్డి, యూత్ మండల్ అధ్యక్షులు చీమల సందీప్, చీమల రాజు, కడారి విక్రమ్, మండల అధికార ప్రతినిధి కొట్టే శ్రీహరి పాల్గొన్నారు.