Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎంహెచ్ఓ అల్లెం అప్పయ్య
నవతెలంగాణ- ములుగు
కిషోర బాలికలు ఐరన్ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ అల్లెం అప్పయ్య అన్నారు. కేర్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కిశోర బాలికల ఆరోగ్యం, పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం డీఎంహెచ్ఓ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. సంబంధిత ప్రత్యేక సంచికను అప్పయ్య ఆవిష్కరించి మాట్లాడారు. రక్తహీనత, ఐరన్ లోపానికి గురికాకూడదని అన్నారు. నులిపురుగులను దరిచేరినివ్వకుండా వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పారిశుధ్యం పాటించాలన్నారు. కేరిండియా ఫౌండేషన్ రూపొందించిన ఈ సంచిక ఉపయగపడుతుం దన్నారు. ఈ కార్యక్రమంలో కేర్ ఇండియా సిబ్బంది డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ విజరు, రూప్సింగ్, కళ్యాణి, రమాదేవి, సాయి ప్రియ, డిఎంహెచ్ఓ కార్యాలయ సిబ్బంది డెమో తిరుపతయ్య, సిహెచ్ఓ దుర్గారావు ,సంపత్ రావు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.