Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
పల్లెలు పరిశుభ్రంగా ఉంచాలని ఎంపీపీ చింతలపల్లి మల్హర్రావు అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ నరసింహ మూర్తి ఆధ్వర్యంలో రెండోవిడత స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) కార్యక్రమంలో భాగంగా సర్పంచ్లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు,మండల స్థాయి ప్రజాప్ర తినిధులు, ఉపాధి సిబ్బంది, మల్టీ పర్పస్ వర్కర్లు,గ్రామ సమైక్యలకు మూడు రోజుల శిక్షణ తరగతులు ప్రారబించారు. ఈ సందర్భంగా జిల్లా స్వచ్ఛ భారత్ మిషన్ జిల్లా కోఆర్డినేటర్ మంద వెంకటేష్, ఎంపీపీ మాట్లాడారు. గ్రామాన్ని బహిరంగ మలవిసర్జన రహితంగా తీర్చిదిద్దాలన్నారు. పారిశుద్ధ్య ప్రణాళికలు తయారు చేస్తూ పల్లెలు అద్దంలా మెరిసెలా చూడాలన్నారు. పారిశుద్ధ్య ప్రణాళికలపై క్షేత్ర సందర్శన, రేట్రోపిట్టింగ్ టాయిలెట్, సోక్ పిట్, కిచెన్ గార్డెన్ నిర్మాణంపై ప్రత్యక్ష క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి అయిత కోమల రాజిరెడ్డి, శానిటేషన్ అధికారి భాస్కర్ రెడ్డి, సర్పంచ్ లు,పంచాయతీ కార్యదర్శులు, ఉపాది,ఐకెపి,విఓఏ సిబ్బంది పాల్గొన్నారు.