Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర పరిశీలన బృందం లీడర్ మనోహరచారి
నవతెలంగాణ-గణపురం
విద్యార్థులు 100శాతం ఉత్తీర్ణత సాధించా లని రాష్ట్ర పరిశీలన బృందం లీడర్ మనోహరచారి అన్నారు. గురువారం మండలంలోని చెల్పూర్ జడ్పీఎస్ఎస్ పాఠశాల, మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలను మనోహర చారితో పాటు టీం సభ్యులు శ్రీనివాసచారి చంద్రం కలిసి పర్యటిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవ తరగతి ప్రత్యేక తరగతుల నిర్వహణ తొలి మెట్టు కార్యక్రమాల అమలును పరిశీలించారు. పదవ తరగతి విద్యార్థులతో మాట -ముచ్చటిస్తూ విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. ఆత్మవి శ్వాసంతో పరీక్షలకు హాజరై విజయవంతంగా పరీ క్షలు రాయాలన్నారు. మీరందరూ ఉత్తీర్ణత సా ధించడానికి విద్యాశాఖ కృషి చేస్తుందని తల్లిదం డ్రులు తోడ్పాటు అందించాలన్నారు. మంచి గ్రేడ్ సాధించడానికి రాష్ట్ర ఎస్సిఆర్టి అభ్యాస దీపికలను పంపిణీ చేసిందన్నారు. రికార్డులు, విద్యార్థుల ప్రశ్న జవాబుల పత్రాలు పరిశీలిస్తూ ఉపా ధ్యా యులకు సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో. ఎంఈఓ సురేందర్ డిసిఇబీ అసిస్టెంట్ కార్యదర్శి శనగరపు భద్రయ్య, ప్రిన్సిపాల్ సుమన్ నోడల్ అధికారి ఉప్పలయ్య పాల్గొన్నారు.