Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రికవరీకి లోకాయుక్త ఆదేశం
- 10 మండలాల లబ్దిదారుల నుండి రికవరీకి 'రెవెన్యూ' కసరత్తు
వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి/నెల్లికుదురు
మహబూబాబాద్ జిల్లాలో గతంలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు ఇండ్లను నిర్మించకుండా బిల్లులు తీసుకున్న వారిని, అధికంగా బిల్లులను తీసుకున్న వారిని గుర్తించి వారి నుండి తీసుకున్న బిల్లులను వసూలు చేయాల్సిందిగా లోకాయుక్త జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లాలోని 10 మండ లాల రెవెన్యూ తహశిల్దార్లకు ఈ మేరకు లబ్ది దారుల నుండి వసూలు చేయాల్సిందిగా ఆదేశా లిచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభిం చకుండానే బిల్లులను అక్రమంగా డ్రా చేశారు. నెల్లికుదురు మండలంలోనే 408 మంది లబ్దిదారుల నుండి రూ.63 లక్షలను రికవరీ చేయాల్సి వుంది. ఇదే తరహాలో మహబూబా బాద్, కేసముద్రం, గూడూరు, డోర్నకల్, కురవి, కొత్తగూడ, తొర్రూరు, మరిపెడ, నర్సింహుల పేట మండలాలలో అక్రమంగా బిల్లులు ఎత్తుకున్న లబ్దిదారుల నుండి ఈ మేరకు రికవరీ చేయనున్నారు. పలు మండలాల అక్ర మార్కుల గుర్తింపుకు కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. రికవరీ చేసి వెంటనే నివేదికను లోకాయుక్తకు సమర్పించాలని ఆదేశాలుండ డంతో రెవెన్యూ అధికారులు ఈ మేరకు వసూలుకు రంగం సిద్ధం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో చోటు చేసుకున్న అక్రమా లపై లోకాయుక్త విచారణ చేసి మహబూబా బాద్ జిల్లాలోని 10 మండలాల్లో అక్రమంగా బిల్లులను తీసుకున్న లబ్దిదారులను గుర్తిం చింది. వారి నుండి వెంటనే రెవెన్యూ రికవరీ ఆక్ట్ 1864 ప్రకారం 6 శాతం వడ్డీతో వసూలు చేయాలని జిల్లా కలెక్టర్‌ను లోకాయుక్త ఆదే శించింది. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ మహబూబాబాద్, కేసముద్రం, గూ డూరు, డోర్నకల్, కురవి, కొత్తగూడ, తొర్రూరు, మరిపెడ, నర్సింహులపేట, నెల్లికుదురు మండ లాల తహశిల్దార్లకు లబ్దిదారుల జాబితాలను పంపి వెంటనే రివకరీ చేసి నివేదికను సమ ర్పించాల్సిందిగా ఆదేశించారు. ఈ మేరకు రెవెన్యూ రికవరీ ఆక్ట్ కింద లబ్దిదారుల నుండి రికవరీ చేయడానికి రెవెన్యూ యంత్రాంగం సమాయత్తమవుతుంది.
రికవరీకి లోకాయుక్త ఆదేశం
ఇందిరమ్మ ఇండ్ల పథకం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2006లో ప్రారంభ మైంది. మూడు దశలలో ఇండ్ల నిర్మాణం చేప ట్టారు. ఈ ఇండ్ల నిర్మాణంలో అక్రమాలు జరిగాయని సర్వత్రా ఆరోపణలు వచ్చాయి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఇండ్లను నిర్మించకుండానే బిల్లులు ఎత్తుకోవడం, పాత ఇండ్లకు బిల్లులు ఎత్తుకోవడం, ఇండ నిర్మాణం పూర్తి కాకున్నా వివిద దశల్లో వున్న ఇండ్లను పూర్తి చేసినట్లు చూపించి బిల్లులు కాజేశారు. ఈ విషయమై లోకాయుక్త 1716/ 2010/బి1 నవంబర్ 7, 2022న అందని ఫిర్యాదు మేరకు సుమోటోగా కేసును స్వీకరించి విచారణ జరిపి బిల్లులను అక్రమంగా కాజేశారని నిర్ధారిం చింది. కేసును సమగ్రంగా విచారించి హన్మ కొండ జిల్లా కలెక్టర్‌ను లబ్దిదారుల నుండి కాజేసిన బిల్లులను రికవరీ చేయాలని ఆదేశిం చింది. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో లోకా యుక్త సూచించిన మండలాలన్నీ మహబూ బాబాద్ జిల్లాలో వుండడంతో హన్మకొండ జిల్లా కలెక్టర్ లోకాయుక్త ఆదేశాలను మహబూబా బాద్ జిల్లా కలెక్టర్‌కు పంపారు. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ మహబూబా బాద్, తొర్రూరు ఆర్డీవోలతోపాటు మహబూబా బాద్, కేసముద్రం, గూడూరు, డోర్నకల్, కురవి, కొత్తగూడ, తొర్రూరు, మరిపెడ, నర్సింహు లపేట, నెల్లికుదురు మండలాల తహశిల్దార్ల కు వెంటనే రికవరీ చేయాలని ఆదేశాలిచ్చారు.
నెల్లికుదురులో రూ.69 లక్షలు..
నెల్లికుదురు మండలంలో రాజుకొత్తపల్లి, మునగలవీడు, బంజర, బ్రాహ్మణకొత్తపల్లి, మదనతుర్తి గ్రామాల్లో 408 మంది లబ్దిదారులు ఇందిరమ్మ బిల్లులను అక్రమంగా కాజేశారని గుర్తించారు. వీరి నుండి రూ.69 లక్షలు రికవరీ చేయడానికి తహశిల్దార్ కార్యా లయం అధికారులు, సిబ్బంది సన్నద్ధమవు తున్నారు. పాత ఇండ్లను ఇందిరమ్మ ఇండ్లుగా చూపించి అక్రమంగా బిల్లులు ఎత్తుకున్నారు. ఇండ్ల నిర్మాణం ప్రారంభించకున్నా, వివిధ దశల్లో ఆగిపోయినా ఆ ఇండ్లు పూర్తయినట్లు చూపించి డబ్బులు ఎత్తుకున్నారు. కలెక్టర్ ఈ మేరకు ఏయే లబ్దిదారుడు ఆన్లైన్లో ఇంటి నిర్మాణం ఏ దశలో వున్నట్లు పేర్కొన్నారు, క్షేత్ర స్థాయిలో ఇంటినిర్మాణం ఎలా వుంది, ఎంత బిల్లు డ్రా చేశాడు, పాత ఇల్లా, ఇంటి నిర్మాణం పరిస్థితి ఎలా వుంటే ఎలా వుందని పేర్కొని అక్రమంగా బిల్లులు కాజేశారో నివేదికలో స్ప ష్టంగా వుంది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేయ కుండానే బారీగా ప్రజా సొమ్మును కాజేశారు.
అక్రమార్కుల గుర్తింపునకు కసరత్తు
జిల్లాలో 16 మండలాలుండగా, ఇందులో 10 మండలాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో అక్రమార్కులు అక్రమంగా బిల్లులు ఎత్తుకు న్నట్లు స్పష్టమైంది. నెల్లికుదురు మండలంలో ఇప్పటికే 408 మంది అక్రమార్కులను గుర్తించి రూ.63 లక్షల రికవరీకి ఆదేశాలు జారీచేయగా, మరికొన్ని మండలాల్లో అక్రమార్కుల జాబితాల రూపకల్పనకు హౌజింగ్, రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది.