Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణరావు
నవతెలంగాణ-భూపాలపల్లి
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి భూకబ్జాలు అవినీతి, అక్రమాలను నిరూపించడానికి ఆధారాలతో సహా రెడీగా ఉన్నానని కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణ రావు స్పష్టం చేశారు. గురువారం హనుమకొండ నుండి విలేకరులతో మాట్లాడుతూ.. హన్మకొండ లోని నక్కలగుట్టలో తన నివాసంలో భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్ కు బయలుదేరడానికి రెడీగా ఉన్న తనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిపెద్ద సంఖ్యలో పోలీసులు తన ఇంటిని చుట్టుముట్టారన్నారు. ఎమ్మెల్యే నిజాయితీపరుడని తేల్చుకోవడానికి బహిరంగ చర్చకు వస్తానని చెప్పి 144 సెక్షన్ ఎందుకు పెట్టించినట్టని ప్రశ్నించారు. ఎమ్మెల్యే బంధువైన ఎస్పీ సురేందర్‌రెడ్డితో ప్రెస్ మీట్ పెట్టి 144 సెక్షన్ పెట్టించావని ఆరోపించారు. పెట్రోల్ వైట్ కిరోసిన్ కలిపి జైలుకెళ్లిన చరిత్ర ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిదని, గిద్దేముత్తారంలో 400 ఎకరాల భూమిని పట్టా చేపించుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. ఇప్పటికీ తన సవాలు కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. గండ్ర రమణారెడ్డి పేదల భూములను కొనుగోళ్ల మాటునచేజిక్కించుకున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు ధరణి పేరుతో జరిగిన కుట్రలో పేదల భూములను అంటూ ప్రశ్నించారు. పోలీసుల చేత భూపాలపల్లి పట్టణంలో నిర్భంద చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే గండ్ర భూకబ్జాలు అవినీతి, అక్రమాలు నిరూపించడానికి నేను సిద్ధం.నీ అవినీతిని నేను నిరూపించకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానాని ప్రతి సవాలు విసిరారు. తాను నిరూపించకపోతే భూపాలపల్లి అంబేడ్కర్ విగ్రహం ముందు ముక్కు నేలకు రాస్తా.. నీ అవినీతి నిరూపణ కు రాకుంటే..దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికకు రా..? నేను ఓడిపోతే శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటా..అని సవాల్ విసిరారు. ఇప్పటికైనా తేదీ టైం ప్రకటించాలని డిమాండ్ చేశారు.