Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బహిరంగ చర్చకు వస్తానని చెప్పిన సత్యనారాయణరావు ఎక్కడ ?
- విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ-భూపాలపల్లి
తాను విసిరిన సవాలకు రేవంత్ రెడ్డి ముందుకు రాలేదని కానీ బహిరంగ చర్చకు వస్తానని చెప్పిన సత్యనారాయణ రావు ఎక్కడ ఉన్నాడని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. భూపాలపల్లి వేధికగా కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 28న హాత్ సే హాథ్ జోడోయాత్రలో పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై గురువారం భూపాలపల్లి అంబెడ్కర్ సెంటర్ లో బహిరంగ చర్చకు సవాల్ విసిరిన నేపథ్యంలో ఉదయం క్యాంప్ కార్యాలయం నుంచి ఆధారాలతో బయలుదేరిన ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ని జయశంకర్ భూపాలపల్లి జిల్లా పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతిని అడ్డుకొని పోలీసులు గండ్ర దంపతులను ఇద్దరిని ఉదయం హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ
అవినీతిని నిరూపిస్తామని ప్రగాల్బాలు పలికిన గండ్ర నారాయణరావు.. హనుమకొండ లో ఉండి పోలీసులు అరెస్టు చేశార అనడం హాస్యాస్పదమన్నారు. రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరినప్పటికీ ఆయన జాడ ఎక్కడ కనిపియ్యలేదని ఏద్దేవా చేశారు.. రాజకీయంగా పలుకుబడి ఉన్న వారిని అనగదొక్కాలని కుట్రలో భాగంగా అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన మాట ప్రకారం తాను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోనే అందుబాటులో ఉన్నానని ఐదు నిమిషాల్లో అంబేద్కర్ సెంటర్ కు చేరుకుంటానని స్పష్టం చేశారు. మంత్రులు ఎమ్మెల్యేలపై విమర్శలు చేస్తున్న రేవంత్‌రెడ్డి సభకు అనుమతులు ఇచ్చే విషయంలో డీజీపీ ఆలోచించాల్సిన అవసరం ఉందని కోరారు. శాంతి భద్రతల పరిరక్షణకు బీఆర్ఎస్ కార్యకర్తలు సహకరించాలని సూచించారు. రాబోయే రోజుల్లో మూడోసారి సత్యనారాయణకు పరాభవం తప్పదని స్పష్టం చేశారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా చూడాలని కార్యకర్తలకు సూచించారు. తాను కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌ని బహిరంగ చర్చకు రావాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో రాలేని రేవంత్ ఇప్పటికైనా భాష పదజాలం మార్చుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పై, రాష్ట్ర మంత్రులపై,తాను పర్యటిస్తున్న ప్రాంతాల ఎమ్మెల్యేలపై చేస్తున్న నీరాధార వ్యాఖ్యలపై పోలిస్‌శాఖ చర్యలు తీసుకోవాలని కోరారు. రేవంత్ బహిరంగ సభలో మాట్లాడిన భూ కబ్జా అంశాలపై తాను ఎప్పటికైనా చర్చకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.b ోలీస్ శాఖ నిర్బంధంలో ఉన్న తమ ప్రజా ప్రతినిధులను,పార్టీ నాయకులని విడుదల చేయాలని కోరారు.