Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇన్చార్జి మాణిక్రావు ఠాక్రే
నవతెలంగాణ- ములుగు
ములుగు జిల్లాలోని రామప్ప శిల్ప సంపద అద్భుతం అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇన్చార్జి మాణిక్రావు ఠాక్రే అన్నారు. గురువారం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన, యునిస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంలో రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాకతీయుల కళావైభవం కళ్ళకు కట్టినట్లు ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమని, రేవంత్ రెడ్డి చేపట్టిన హత్ సే హాత్ యాత్ర విజయవంతం అవుతుందన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివద్ధి సాధ్యం అన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, ఏఐసిసి కార్యదర్శి రోహిత్ చౌదరి, మాజీ కేంద్ర మంత్రివర్యులు పోరిక బలరాం నాయక్, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, వేణుగోపాల్ శర్మ, మహబూబాద్ జిల్లా అధ్యక్షులు భారత్ చంద్రరెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నునా వత్ రాధా, నెహ్రూ నాయక్ పాల్గొన్నారు.
మంచి నాయకున్ని కోల్పోయాం...
జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మంచి నాయకున్ని కోల్పోయామని, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల్ల కుమారస్వామి మృతి కాంగ్రెస్ పార్టీ కి తీరని లోటని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్రావు ఠాక్రే అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో నల్లెల్ల కుమారస్వామి ఇటీవలే మృతిచెందగా ఆయన చిత్ర పటానికి ఎమ్మెల్యే సీతక్కతో కలిసి గురువారం నివాళులర్పించారు. వారి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ములుగు పట్టణం చెందిన మాట్ల బ్రదర్స్, బాస్ ఫోటో స్టూడియో, కీర్తన ఫ్లెక్సీ సెంటర్ వారు రూపొందించిన నల్లెల కుమారస్వామి స్మతి గీతాన్ని ఆవిష్కరించారు.