Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - శాయంపేట
శాయంపేట మండలంలోని పెద్దకోడెపాక గ్రామంలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిసాయి. ఉదయం 9 గంటల నుండి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగా మందకోడిగా కొనసాగింది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు గడువు సమయం కావడంతో చివరి అరగంట ముందు 300 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రానికి రాగా, ఎన్నికల రిటర్నింగ్ అధికారి విజయ భాస్కర్ రెడ్డి ఓటర్లకు టోకెన్లు అందజేసి రెండు గంటల వరకు ఓటింగ్ ప్రక్రియను కొనసాగించారు. సొసైటీలో 1166 మంది ఓటర్లు ఉండగా, 886 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓట్ల లెక్కింపులో 823 ఓట్లు చెల్లుబాటు కాగా, 63 ఓట్లు చేల్లనివిగా గుర్తించారు. ఈ ఎన్నికలను పరకాల ఏసిపి జె. శివ రామయ్య ఆధ్వర్యంలో పరకాల సబ్ డివిజన్ పోలీసులు బందోబస్తు మధ్య ప్రశాం తంగా ఎన్నికలను నిర్వహించారు. పెద్ద కోడెపాక సొసైటీలో 39 అభ్యర్థులు బరిలో నిలవగా గెలిచిన 9 మంది డైరెక్టర్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి విజయ భాస్కర్ రెడ్డి ప్రకటించారు. డైరెక్టర్లుగా గండి రాజమౌళి, ఐరబోయిన రాజు, కుక్కల తిరుపతి, ఐరబోయిన తిరుపతి, పల్లె బోయిన భాస్కర్, కుక్కల ఆనంద్, అన్నబోయిన శంకర్, పల్లెబోయిన సురేష్ కుమార్, మోరే నరేష్ ఎంపికైనట్లు ప్రకటించారు.