Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ యస్ క్రిష్ణ ఆదిత్య
నవతెలంగాణ - ములుగు
మన ఊరు మన బడి కింద ఎంపిక చేసిన మోడల్ పాఠశాలల ప్రారంభోత్సవానికి సన్నద్దం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ క్రిష్ణ ఆదిత్య సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సీసీ రోడ్ల నిర్మాణాలు, 10వ తరగతి పరీక్షలు, మన ఊరు మన బడి పనులపై డీఈఈలు, ఎంఈఓలు, ఏఈలతో మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎంపిక చేయబడిన మన ఊరు మన బడి పాఠశాలలో జరుగుతున్న పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ నెలలో ప్రారంభించేందుకు సన్నద్దం చేయాలని అన్నారు. పెండింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. పాఠశాల సుందరీకరణ పనులు, పచ్చదనం పెరిగేలా మొక్కలు నాటి గ్రీనరీ పెంచాలని, పాఠశాల పేరుతో బోర్డు చేయాలని, పాఠశాలలకు మంచి లుక్ వచ్చే విధంగా తయారు చేయాలని ఆదేశించారు. ఎంఈఓలు రోజు ఒక పాఠశాల చొప్పున విజిట్ చేస్తూ అన్ని పాఠశాలల్లో పనులు త్వరగా పూర్తి అయ్యేలా పర్యవేక్షించాలన్నారు. 10వ తరగతి పరీక్షల ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా బోధన ఉండాలని అన్నారు. ఆ దిశగా ఉపాధ్యాయులు పకడ్బందీ చర్యలు తీసుకునే విధంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. జిల్లాలో పూర్తి చేసిన సీసీ రోడ్ల యుసీలు పూర్తి చేసి ఎఫ్టిఓ జెనరేట్ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో డీఈఓ పానిని, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ హేమలత, ఈ ఈనరేందర్ రెడ్డి, ఆర్ అండ్ బి ఈఈ వెంకటేష్, డీఎస్ఓ జయదేవ్, ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.