Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
నవతెలంగాణ-సుబేదారి
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు ఎక్కువగా జరగాలని,ప్రైవేటు ఆసుపత్రుల్లో సి సెక్షన్లు తగ్గేలా చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. హనుమకొండ జిల్లాలోని ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరును డీఎంహెచ్ఓ, ప్రోగ్రాం అధికారులతో కలెక్టరేట్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం అమలును సమీక్షించి క్యాంపులకు ఆశాలు, మెప్మాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులు 18 సంవత్సరాల పైబడిన వారందరినీ పరీక్షలకు వచ్చేలా చూడాలన్నారు. జిల్లాలో మాతా శిశు సేవలను సమీక్షిస్తూ గర్భిణీలను మూడు నెలల లోపే రిజిస్ట్రేషన్ విధిగా చేయించేలా చూడాలని అన్నారు. సి సెక్షన్ డెలివరీల ఆడిట్ నిర్వహిస్తూ సాధార ణ ప్రసవాలు ఎక్కువగా జరిగేలా చూడాలన్నారు. టీబీ నియంత్రణలో భాగంగా ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులలో టీబీ చికిత్స తీసుకునే వారందరికీ నిశ్చయపోషయన్ ద్వారా చికిత్స పూర్తి అయ్యేవరకు నెలకు రూ.500 చొప్పున అందించాలన్నారు. పిల్లలకు 100 శాతం వ్యాధి నిరోధక టీకాలు అందించాలని అన్నారు. ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ బి. సాంబశివరావు, అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ మదన్మోహన్రావు, డిప్యూటీ డీహెంచ్ఓ యాకుబ్ పాషా, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఉమా శ్రీ, డాక్టర్ వాణిశ్రీ, డాక్టర్ హిమబిందు, డాక్టర్ రవి కుమార్, జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్ రెడ్డి, స్టాటిస్టికల్ ఆఫీసర్ ప్రసన్న కుమార్, ఆఫ్తార్మిక అధికారి రవీందర్ రెడ్డి, డిపిఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.