Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రేగొండ
మండలంలోని సుప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొడవ టంచ జాతర బ్రహ్మౌత్స వాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారిని డప్పు చప్పుళ్ల మధ్య గ్రామంలోని దేవాలయ మాఢ వీధుల గుండా ఊరేగించారు.మండలంలోని ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో స్వామివారి బ్రహ్మౌత్సవ జాతర కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. శేషవాహన సేవ పుట్ట బంగారు సేవ అంకురారోపణం ఆలయ అర్చకులు జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మాదాడి అనిత కరుణాకర్ రెడ్డి ఆలయ ఈవో బిల్ల శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ పబ్బ శ్రీనివాస్, ఎంపీటీసీల పోరం జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి రవీందర్రావు ఆలయ డైరెక్టర్లు పోగు సుమన్ గండి తిరుపతి , ఆలయ సిబ్బంది రవీందర్ శ్రావణ్ సుధాకర్ ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.