Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంగన్వాడీల కలెక్టరేట్ ముందు 48 గంటల వంటావార్పు నిరసన విజయవంతంగా ముగిసిన సమ్మె
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాపర్తి రాజు
నవతెలంగాణ-జనగామ
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై అంగన్వాడీలు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు పిలుపు నిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన సమ్మె లో కలెక్టరేట్ ముందు 48 గంటల నిరసన వంటావార్పు నిరసన కార్యక్రమం విజయవంతంగా అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ నిర్వహించారు. అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలో సమ్మె విజయవంతంగా శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా అంగన్వాడీలు శుక్రవారం స్థానిక అంబేద్కర్ ఆర్టీసీ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రాపర్తి రాజు పాల్గొని మాట్లాడారు. అంగన్వాడి సమ్మెకు వివిధ ప్రజాసంఘాల సంపూర్ణ మద్దతు ప్రకటించాయని ప్రత్యక్షంగా పాల్గొని అంగన్వాడీలకు అండగా ఉంటామని తెలియజేసిన ప్రజాసంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా జిల్లా కోశాధికారి సుంచు విజేందర్ , అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి మచ్చ శారద, తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందు నాయక్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు దడిగ సందీప్, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గణేష్ నాయక్, సీఐటీయూ టౌన్ కమిటీ సభ్యులు గంగరబోయిన మల్లేష్ రాజ్,అంగన్వాడీ యూనియన్ జిల్లా మండల నాయకులు రాజకల సరిత, జయమ్మ రాజేశ్వరి, యాదమ్మ, రజిత, సుజాత, రాజలక్ష్మి, లక్ష్మణ్ బారు, స్వరూప, శోభ, కవిత, పద్మ, ఉమా, రాజ, పూల రజిని పాల్గొన్నారు.
వరంగల్ : రెండవ రోజు వరంగల్ జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా అంగన్వాడీ టీచర్స్ సమ్మె ఉధతంగా కొనసాగుతుంది.అంగన్వాడి టీచర్ల సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో తీవ్రమైన పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. రెండవ రోజు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథుతిగా జిల్లా కార్యదర్శి మొక్కేర రామస్వామి, అంగన్వాడీ టీచర్స్ జిల్లా కార్యదర్శి రాజేశ్వరి హాజరై మాట్లాడారు. అంగన్వాడి టీచర్ల పోరాటంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన వేతనాలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని ఆన్లైన్ సిస్టం ను రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్రం వచ్చినంక అంగన్వాడి వర్కర్స్ గా ఉన్న పేరును మార్చి సీఎం అంగన్వాడీ టీచర్స్ గా మార్చారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలో ఇచ్చిన ఏ ఒక్క హామీలను నెరవేర్చకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మభ్యపెడుతూ కార్మికులను దీనస్థితిలోకి దిగజారేలా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మొండిగా వ్యవహరిస్తున్నారు అనంతరము అదనపు కలెక్టర్ శ్రీవాత్సవానికి డిమాండ్ తో కూడుకున్న వినతి పత్రం అందజేశారు వారు కూడా మీ సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం దష్టికి తీసుకుపోతామని హామీ ఇచ్చారు. ఈ సమ్మెకు మద్దతుగా సిపిఎం వరంగల్ జిల్లా కార్యదర్శి రంగయ్య, బి.ఎస్.పి హనంకొండ జిల్లా అధ్యక్షులు శనిగరపు రాజు, సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎం.సాగర్ జిల్లా కోశాధికారి సింగార బాబు, మద్దతు తెలిపేరు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అంగన్వాడీ టీచర్స్ నాయకులు రుక్మిణి, నిర్మల, లక్ష్మి, ఆదిలక్ష్మి, భవాని, భారతి, అనిత, జ్యోతి, రాజా, భాగ్యమ్మ, రేణుక, అరుణ పాల్గొన్నారు.
మహబూబాబాద్ : కేంద్ర బడ్జెట్లో నిధులు కోత పెట్టి బీజేపీి ప్రభుత్వం ఐసిడిఎస్‌ను బలహీన పరుస్తుందని ఐసీడీఎస్ రక్షణ కోసం కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని ప్రతిఘటించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో మూడు రోజులు జరిగిన సమ్మె ముగింపు సందర్భంగా వక్తలు హెచ్చరించారు. ఈ సందర్భంగా శుక్రవారం ధర్నా చౌక్ వద్ద భారీ ఎత్తున వంటా వార్పుతో ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బెస్త సంపూర్ణ, గుగులోత్ సరోజ సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకుల రాజు, కుంట ఉపేందర్‌లు మాట్లాడారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం గ్రామీణ ప్రాంత పేదలకు పోషక ఆహారాన్ని దూరం చేస్తుందని విమర్శించారు. నాణ్యమైన పోషకాహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల శ్రమదోపిడి చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని పోరాటాల ద్వారా ప్రతిఘటించాలని పిలుపునిచరు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని నూతన విద్యా విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ పిలుపుమేరకు 3 రోజులు సమ్మె నిర్వహించిన జిల్లాలోని అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు మినీ టీచర్లు చీమల దండుల కదిలి వచ్చారు. అంగన్వాడీ నినాదాలతో ధర్నా చౌక్ దద్దరిల్లింది. ఐసిడిఎస్ ద్వారానే పేదలకు పోషకాహారం అందుతుందని అన్నారు. మహిళా కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్న పాలకులకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. అనేక రంగాల పోరాటాలకు అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ చేస్తున్న పోరాటాలు అండగా ఉంటుందన్నారు. ఈ ధర్నా కార్యక్రమానికి అంగన్వాడి యూనియన్ నాయకురాలు తిరుపతమ్మ, స్నేహ బిందు, మల్లికాంబ, సుజాత,శివకుమార్ , రఫియా, జ్యోతి, సులోచన, రమాదేవి, స్వరూప, నీలాదేవి, విక్టోరియా, తదితరులు పాల్గొన్నారు.