Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉప్పొంగిన భక్త జన సందోహం
- పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే రాజయ్య, జెడ్పీ చైర్మన్
నవతెలంగాణ-స్టేషన్ ఘనపూర్
చిల్పూర్ గుట్ట శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం దేవస్థానం చైర్మన్ పోట్లపల్లి శ్రీధర్ రావు ఆధ్వర్యంలో శ్రీ బుగులు వెంకటేశ్వరుడి తిరుకళ్యాణ మహోత్సవము వైభవంగా జరిగింది. రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పటు ్టవస్త్రాలు స్వామివారికి సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించి, కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. వేదపండితుల ఆధ్వర్యంలో 86 మంది పుణ్యదంపతుల సమక్షంలో సుమారు గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ. 50 లక్షలతో ఇప్పటికే పనులు చేపట్టారు.
భక్తులకు కల్పించిన సకల సౌకర్యాల ఏర్పాట్లపై ఛైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు పనితీరుపై మంత్రితోపాటుగా, తరలివచ్చిన అశేష భక్తజనం ప్రశంసల జల్లు కురిపించారు. దేవాలయాన్ని అభివృద్ధి చేయడమే గాక, పరిసర రూపురేఖలు సమూలంగా మార్చుతారనే ఉద్దేశంతో శ్రీధర్ రావును ధర్మకర్తల మండలి చైర్మన్గా చేయడం జరిగిందన్నారు. దేవాలయ అభివృద్ధికి రూ. 10 కోట్లతో నివేదిక ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లి మరో తిరుపతిగా తీర్చిదిద్దేటందుకు కృషి చేస్తానని మంత్రి హమీ ఇచ్చారు.ఈకార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవెళ్లి క్రిష్ణారెడ్డి, ఎంపిపి బొమ్మిశెట్టి సరితా బాలరాజు, ఆఫీస్ ఇంచార్జీ ఆకుల కుమార్, డీసీసీబి డైరెక్టర్ గుండ్రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, రైతు సమన్వయ నాయకులు ఎడవెళ్ళి మాధవరెడ్డి, సర్పంచ్ ఉద్దేమారి రాజ్ కుమార్, ధర్మకర్తల మండలి సభ్యులు పొన్న రజిత రంజిత్, నియోజక కో ఆర్డినేటర్ కేశిరెడ్డి మనోజ్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ గుజ్జరి రాజు, డైరెక్టర్లు చల్లారపు శ్యాం సుందర్ పాల్గొన్నారు.