Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్
నవతెలంగాణ-హనుమకొండ
బిజెపి అంటే భారత జనులను దోచుకునే పార్టీ అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. శుక్రవారం హనుమకొండ చౌరస్తాలో సుభాష్ చంద్రబోస్ విగ్రహం దగ్గర కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మహిళలతో కలిసి రెండో రోజు నిరసన కార్యక్రమంలో దాస్యం వినరు భాస్కర్ ఆధ్వర్యంలో వంట వార్పు కార్యక్రమం చేపట్టి నిరసనకు వచ్చిన మహిళలకు కట్టలె పోయ్యు మీద వండి స్వయంగా అందరికీ వడ్డించారు అనంతరం ఆయన మాట్లాడుతూ భార్య, పిల్లలు, కుటుంబం ఉంటే ఎవరికైనా బాధలు తెలుస్తాయి ఒంటరి పురుషులకు ఏ భాద తెలియదు, భాద్యతలు ఉండవు అందుకే అడ్డగోలుగా గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతున్నాడు గతంలో కట్టెల పొయ్యి మీద వంటచేస్తుంటే పొగ కారణంగా మహిళలకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేవని కాని ఇప్పుడు పెరిగిన గ్యాస్ ధరల కారణంగా వంట చేయకముందే మహిళల కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. మహిళల ఏడుపుకు కారణమైన మోదీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మహిళల ఏడుపు ఊరికే పోదు బీజేపీ నేతత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి దేశ మహిళల ఏడుపు తగులుతుందని అన్నారు . మహిళల కన్నీళ్లలో బీజేపీ పార్టీ కొట్టుకుపోవడం ఖాయం అన్నారు ఆదాని, అంబానీ మీద ఉన్న ప్రేమలో పావుల వంతైనా దేశ ప్రజల మీద ఉంటే బాగుండేదని నరేంద్ర మోదీ నేతత్వంలోని కేంద్ర ప్రభుత్వం హయాంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేరు ఏదో రకంగా ప్రజలను కేంద్ర ప్రభుత్వం పట్టి పిడిస్తుంది పోయే కాలం వస్తే ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటారని మోదీ ప్రాభ్యత్వానికి పోయే కాలం వచ్చింది కాబట్టే అన్ని ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నయి అన్నారు.ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజ్ యాదవ్, మేయర్ గుండు సుధారాణి, కార్పొరేటర్లు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.
మోదీ పాలన వంటగదిలో మంటలు : అరూరి
నవతెలంగాణ-ఐనవోలు
మండల కేంద్రంలో శుక్రవారం కాలి సిలిండర్లతో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అరూరి ఈ సందర్భగా మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అడ్డగోలుగా గ్యాస్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. గడియకోసారి పెరుగుతున్న గ్యాస్ ధరలతో ప్రజలకు గుండె దడ వస్తోందన్నారు. మోదీ పాలనలో వంట గదుల్లో మంటలు పుడుతున్నాయని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచి దేశ ప్రజలపై దొంగ దాడి చేస్తోందని ధ్వజమెత్తారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయలేని దౌర్భాగ్య పాలనలో దేశం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థ పాలన విధానాలపై బీఆర్ఎస్ పార్టీ నిరంతర పోరు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మార్నెని రవీందర్ రావు, జడ్పీవైస్ చైర్మన్ గజ్జల శ్రీరాములు, ఎంపీపీ మధుమతిరవీందర్ రావు, మండల ప్రజా ప్రతినిధులు, మహిళలు, నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
మట్టెవాడ :
మోడీ ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంపునకు నిరసనగా వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తాలో పెద్ద ఎత్తున ధర్నా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.మహిళలు,ప్రజలు పెద్దఎత్తున పాల్గొని రోడ్డుపైన వంట చేసి కాళీ సిలిండర్లతో నిరసనను వెలిబుచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాన్యుల నడ్డివిరిచే విదంగా కేంద్రలోని మోడీ ప్రభుత్వ చర్యలు ఉన్నాయని అన్నారు. తాజాగా మరోసారి గ్యాస్ ధరలు పెంచి పేదలపై భారంమోపిన మోడీ ప్రభుత్వం గద్దె దిగే రోజులు దగ్గరపడ్డాయన్నారు. మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకు మోడీ సర్కారు ఇచ్చే కానుక ఇదేనా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. గ్యాస్ బండను సమాన్యులపై గుదిబండగా మార్చారని ఇప్పటికే పెంచిన నిత్యావసర సరుకులు,పెట్రోల్ ,డీజిల్ ధరలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని మరోమారు సిలిండర్ ధర పెంచి ప్రజల పై అధిక భారం మోపుతున్నారని మోడీ సర్కారు ప్రజాగ్రహానికి బలికాక తప్పదని ఎమ్మెల్యే హేచ్చరించారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను ఎంతో అభివద్ధి చెందిందని ప్రజలను ఆర్థికంగా ఎదిగే విదంగా ప్రణాళికలతో ముందుకుపోతుంటే గ్యాస్,నిత్యావసర సరుకుల ధరలు పెంచి అధికభారం మోపి ప్రజలను గోస పెడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు.కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా పెంచిన గ్యాస్ ధరలు తగ్గించి మహిళాలోకానికి,ప్రజలకు మోడీ సర్కారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, గందె కల్పన నవీన్, చింతాకుల అనిల్ కుమార్, భోగి స్వర్ణలత సురేష్, కావేటి కవిత, అరుణ, సురేష్ జోషి, మాజీ కార్పొరేటర్లు,మహిళానాయకురాళ్లు,టెంపుల్ డైరెక్టర్లు,డివిజన్ల అధ్యక్షులు,ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలి
సీపీఎం కాశిబుగ్గ ఏరియా కార్యదర్శి బషీర్
నవతెలంగాణ-కాశిబుగ్గ
ఇప్పటికే పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్య ప్రజలపై మరోసారి వంటగ్యాస్ భారం మోపిన కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పాలని సిపిఐ (ఎం) కాశిబుగ్గ ఏరియా కమిటీ కార్యదర్శి మహమ్మద్ బషీర్ అహ్మద్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సిపిఎం కాశిబుగ్గ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో 14వ డివిజన్ బాలాజీ నగర్ జంక్షన్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎండి బషీర్ మాట్లాడుతూ పేద మధ్య తరగతి ప్రజలు పడుతున్న బాధలు ఏమాత్రం ఆలోచించకుండా కేంద్ర ప్రభుత్వం తన ఎనిమిదేళ్ల పాలనలో ఇప్పటివరకు గ్యాస్ ధరను రూ.745 పెంచిందన్నారు. మోడీ పాలన ఆదాని, అంబానీ లాంటి ఉన్నత వర్గాలకు మేలు చేస్తూ పేదలను మరింత పేదలను పేదరికంలోకి నేడుతున్నారని అన్నారు. బిజెపి ప్రభుత్వం దేశంలో ఒక ప్రక్కన మత విద్వేషాలు రెచ్చగొడుతూ మరో పక్కన ధరలు పెంచుతుందన్నారు. ఇప్పటికైనా పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని లేనియెడల తమ పోరాటాన్ని ఉదతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు హైమత్, ఎంహెచ్ నగర్ 2 శాఖ కార్యదర్శులు జన్ను సురేష్, వెన్నపూస రమేష్, దిబ్బ సుమన్, వట్టి కల్పన, ధార సునీత, బర్ల రజిత, కనకలక్ష్మి, శారద, భూదేవి, ఉమాదేవి, అశోక్, మంజుల, రూప, రాజు, శ్రీనివాస్, నజీర్ పాల్గొన్నారు. పెరిగిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కాశిబుగ్గ జంక్షన్ లో ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి రహేల మాట్లాడుతూ ఉచితాలు సబ్సిడీలు లేని ఆర్థిక వ్యవస్థ రావాలని నీతి వాక్యాలు చెబుతున్న ప్రధాని మోడీ నిత్యవసర ధరలు పెంచుతూ పేదలపై భారం మోపడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. కార్యక్రమంలో భవాని, కుమారి, ప్రశాంతి, సుప్రియ, తదితరులు పాల్గొన్నారు.
సిలిండర్ ధర పెంపుకు నిరసనగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో వంటావార్పు
నవతెలంగాణ-వరంగల్
కాంగ్రేస్ పార్టీ నాయకుడు మహ్మద్ అయూబ్ అద్వర్యంలో పోచమ్మ మైదాన్ జంక్షన్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి గ్యాస్ పెంపుదలపై రోడ్డుపై వంటావార్పు చేసి నిరసనను వెలిబుచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పెనుబారం మొపుతున్నారు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచుతు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుందనీ అన్నారు. కేంద్ర ప్రభుత్వంకు గడచిన 9 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సర్కారు వంతపాడుతు ప్రతి బిల్లుకు మద్దతు తెలిపిన విషయంను రాష్ట్ర ప్రజలు మరవరనీ అన్నారు. రాష్ట్రంలో అన్ని రకాల విద్యత్ ఛార్జీలు, బస్సు చార్జీలు,రిజిస్టేషన్ చార్జీలు,ఇంటిపన్ను చార్జీలు చెత్త పన్ను చార్జీలు అకరికి మందుపై బాదుడు బాది దొందు దొందే అనే రీతిలో ఉన్నారని మండిపడ్డారు. అన్ని రకాలుగా ప్రజలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు జలగలాగా పిల్చీ పిప్పీ చేస్తున్నారు.కాని దొంగే దొంగ అన్న ఛందగా ఇవలా %దీ = ూ% నాయకులు దర్నాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. అందువల్ల రానున్న రోజుల్లో కాంగ్రేస్ పార్టీని గెలిపించడం వల్ల గ్యాస్ 500 కే ఇవ్వడం జరుగుతుందనీ నిరుపేద మద్య తరగతి వారికి లాభం జరగాలంటే కాంగ్రేస్ పార్టీ ఆదికారంలోకి రావలని మహ్మద్ అయూబ్ అన్నారు.ఇ కార్యక్రమంలో జిల్లా మహిళ అద్యక్షురాలు పార్వతమ్మ, జిల్లా బిసి సంఘాల అధ్యక్షులు ఒర్సు తిరుపతి,జన్ను రవి, గజ్జల లింగన్న, గొల్లేన రవి, జన్ను వివేక్, ఆదాం, గిన్నారం రాజు, జన్ను జీవన్ వేణు తజమముల్ మన్సుర్. జాని పాల్గొన్నారు.
మోడీ పాలనలో సామాన్యుల జీవితం ప్రశ్నార్థకం
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
నవతెలంగాణ -పరకాల
పెంచిన ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించి సామాన్యుల జీవితాలతో చెలగాటం ఆడద్దని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు .శుక్రవారం బి ఆర్ ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు పరకాల నియోజకవర్గం పట్టణ కేంద్రం లోని అంబేద్కర్ సెంటర్ నుండి స్థానిక బస్టాండ్ కూడలి వరకు గ్యాస్ సిలిండర్ల పొయ్యిలతో ర్యాలీగా వెళ్లి కట్టెల పొయ్యి వెలిగించి వంట వార్పుతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ వంటగదిలో మంట పెట్టిన మోడీ పతనం ప్రారంభమైందని అన్నారు .బిజెపి పాలనలో నిత్యవసర సరుకులు ఆకాశాన్ని అంటుకున్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అధికారంలోకి వచ్చాక నల్లధనం వెలికి తీస్తానని చెప్పి మోడీ నేటికీ తీసింది లేదని, 15 లక్షల ఖాతాలో వేస్తానని చెప్పిన మాట అమలుపరచకపోవడం సిగ్గుచేటు అన్నారు .వేలకోట్ల విలువచేసే ఆస్తులను కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం చాలా దారుణం అన్నారు. ఆదానికి నష్టం వచ్చిందని గ్యాస్ ధరలు పెంచడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. దేశంలో టెండర్లన్నీ గుజరాత్ కంపెనీకి అప్పగిస్తున్న మోడీ ప్రభుత్వాన్ని వెంటనే గద్దె దించేలా ప్రజలు సహకరించాలన్నారు .బిజెపి మన ముఖ్యమంత్రి కేసీఆర్ ను తిట్టడమే పనిగా మారిందని అందుకనే మోడీ అవినీతి అసమర్ధ పాలనను గద్దె దించేందుకే బి ఆర్ ఎస్ పార్టీ స్థాపించడం జరిగిందన్నారు. ఇప్పటికైనా పెంచిన గ్యాస్ ,పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించకపోతే దేశంలో రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ప్రజలచే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ షో ద అనిత- రామకష్ణ ,వైస్ చైర్మన్ రేగురు జయపాల్ రెడ్డి ,మార్కెట్ చైర్మన్ బండి సారంగపాణి ,ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జడ్పిటిసి మొగిలి ,స్థానిక కౌన్సిలర్లు, సంపత్ ,సారయ్య, రాజు ,నాయకులు పట్టణ అధ్యక్షులు మడికొండ శీను, సాయి తిరుపతి రెడ్డి మార్క రఘుపతి గౌడ్ బండి సదానందం ,6బట్టు రవి ,మేకల దేవయ్య, మహిళా నాయకులు కళావతి ,రజిని కార్యకర్తలు పాల్గొన్నారు.