Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ.రంగనాథ్
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
లైంగింక దాడులకు గురైన మహిళలు, చిన్నారులకు న్యాయం చేసే దిశగా భరోసా కేంద్రం పనిచేయాల్సి వుంటుందని వరంగల్ పోలీస్ కమిషనర్ పిలుపునిచ్చారు. వరంగల్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా పోలీస్ కమిషనర్ భరోసా కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఈ కేంద్రం పనితీరుపై పోలీస్ కమిషనర్ సమీక్షా జరిపారు. భరోసా కేంద్రం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు భరోసా కేంద్రాన్ని ఆశ్రయించిన బాధితుల సంఖ్యతో పాటు ఎంత మంది బాధితులకు న్యాయం జరిగింది. ఎంతమందికి ప్రభుత్వపరంగా అందించే పరిహారాన్ని అందజేయడం జరిగిందని తదితర వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈ విభాగానికి చెందిన అధికారులు, సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ లైంగిక దాడులు గురైన మహిళలు, చిన్నారులకు స్వాంతన కలిగించే కేంద్రంగా భరోసా కేంద్రం నిలవాలని, ఈ కేంద్రానికి వచ్చిన వారికి న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని బాధితులకు కలిగించాల్సి ఉండాలన్నారు. బాధితలకు సంబంధించి కోర్టు కేసులతో పాటు, ట్రయల్స్‌ను కూడా ఎప్పటికప్పుడు భరోసా కేంద్రం సిబ్బంది పర్యవేక్షించాలన్నారు. అలాగే నిందితుల నేరాలను కోర్టులో నిరూపించబడి వారికి శిక్ష పడేవిధంగా కషిచేయాలని పోలీస్ కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమములో క్రెమ్స్ డీసీపీ మురళీధర్, అదనపు డీసీపీ పుష్పారెడ్డి, క్రైమ్స్ ఏసీపీ డేవిడ్‌రాజు, ఇన్స్పెక్టర్ సువర్ణ, ఎస్సై శ్రావణి, కేంద్రం ఇంచార్జ్ సాగరిక, లీగల్ సపోర్ట్ ఆఫీసర్ నీరజ, సిబ్బంది పవిత్ర, నవ్య, రజిత పాల్గొన్నారు.