Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లబ్ధిదారులకు న్యాయం చేయాలి - కళ్యాణం లింగం
నవతెలంగాణ-జనగామ
ఇందిరమ్మ మూడో విడత ఇళ్ల స్థలాల లబ్ధిదారులకు సర్వేల పేరిట కాలయా పన చేస్తే సహించేది లేదని ఇందిరమ్మ ఇండ్ల సాధన కమిటీ అధ్యక్షులు కళ్యాణం లింగం అన్నారు. స్థానిక బాణాపురం ఐలమ్మ కాలనీలో ఇండ్ల సాధన కోసం చేపట్టిన దీక్షలు శుక్రవారం నాటికి 23వ రోజుకు చేరాయి. ఈ దీక్షలను కల్యాణ లింగం ప్రారంభించి మాట్లాడుతూ అధికారులు స్థానిక ఎమ్మెల్యే స్పందించి లబ్ధిదా రులకు న్యాయం చేయాలని కోరారు. మూడో విడత ఇందిరమ్మ పథకం ద్వారా పట్టాలిచ్చి స్థలాలు చూపించడం మరిచారని నేటి తెలంగాణ ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన వాళ్లకు 6 నెలల్లోడబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని వాగ్దానం చేసి నేటికీ ఐదు సంవత్సరాలు కావస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి కాకపోవడం పేదల పట్ల జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి చిత్త శుద్ధి లేదన్నారు. ఇప్పటికైనా స్పందించి అర్హులందరికీ డబ్బులు బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం పూర్తి చేసి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొన్ని శాంత, కొలిపాక వెంకటలక్ష్మి, ఏనుగుల కమల, తిప్పారపు తులసి, యాదమ్మ, వెంకటేష్, బాబురావు తదితరులు పాల్గొన్నారు.