Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
మార్చి 5న మానుకోట జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ తెలంగాణ తొలి రాష్ట్ర మహాసభకు హాజరుకావాలని మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవితను ఆహ్వానించినట్లు మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు తేజ రవి నాయక్ తెలిపారు. శుక్రవారం మహబూబాబాద్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ అధ్యక్షులు తేజవతు రవి నాయక్, ప్రధాన కార్యదర్శి, బానోత్ లక్ష్మణ్ నాయక్, గౌరవ అధ్యక్షులు లావు డియా రాము నాయక్, జిల్లా కోశాధికారి తేజావత్ ప్రమోద్ నాయక్, బానోత్ బాలు నాయక్ పాల్గొన్నారు.