Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేసముద్రంరూరల్
ప్రపంచాన్ని జయించాలంటే కేవలం చదువే మార్గమని ట్రస్మ డివిజన్ ప్రెసి డెంట్ యాకాంతం గౌడ్ అన్నారు. అనంతరం ప్రశ్నపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యాకంతం గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులకు నిర్వహిస్తున్న టా లెంట్ టెస్ట్ ఎంతో ఉపయోగకరమని, విద్యార్థులలో భయం పోగొట్టేందుకు భవి ష్యత్తులో రాసే కాంపిటీటివ్ ఎగ్జామ్‌లకు ఈ టాలెంట్ టెస్ట్ ఎంతో దోహదపడుతుం దని అన్నారు. చాలామంది విద్యార్థుల్లో పరీక్షలు రాసేటప్పుడు భయంతో సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉందని, ఆ భయం పోగొట్టేందుకు విద్యార్థులను చైతన్యం చేస్తు న్న ఈ టాలెంట్ టెస్ట్ ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని అన్నారు. అదే విధం గా డివిజన్ కార్యదర్శి సూర్య ప్రకాష్ మాట్లాడుతూ త్వరలో జరగనున్న పబ్లిక్ పరీ క్షలకు సిద్ధం చేసేందుకు ఎస్ఎఫ్ఐ పదవ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నదన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి అనునిత్యం పోరాటాల తో ముందుకు వెళుతున్న ఎస్ఎఫ్ఐ పోరాటాలే కాదు విద్యార్థులు చదువుల్లోనూ ముందుండాలని కోరుకుంటూ ఈరోజు మండల కేంద్రంలో వివేకవర్ధిని పాఠశాల, వివిధ పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులకు టాలెంట్ నిర్వహిస్తున్నది. నూతన సిలబస్ ఆధారంగా రూపొందించబడిన ప్రశ్నాపత్రం వంద మార్కులతో అన్ని సబ్జెక్టులతో కలిపి మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటుందని తెలిపారు. అదేవి ధంగా అత్యధికంగా మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు కూడా ఇ వ్వడం జరుగుతుందని, విద్యార్థుల బంగారు భవిష్యత్ లక్ష్యం కోసం ఎస్ఎఫ్ఐ టా లెంట్ టెస్ట్ నిర్వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ నాయకులు సింహాద్రి, మండల నాయకులు ఉమేష్, ఉమాపతి పాల్గొన్నారు.