Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ మాలోతు కవిత
నవతెలంగాణ-మహబూబాబాద్
తెలంగాణలో పేదల ఆరోగ్య సంరక్షణకు నిధుల కొరత లేదని ఎన్ని నిధులైన ఇవ్వడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని ఎంపీ మాలోత్ కవిత అన్నా రు. శుక్రవారం మహబూబాబాద్ క్యాంప్ కార్యాలయంలో 59 మంది లబ్దిదారు లకు 34,85,500 విలువగల చెక్కులను ఎంపీ మాలోతు కవిత పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కేఎస్ఎన్ రెడ్డి, ముత్యం వెంకన్న గౌడ్, జెడ్పీ కో-ఆప్షన్ మహాబూబ్ పాషా, పీఏసీఎస్ చైర్మన్ సంపేట రాము గౌడ్, బోడ పథ్వీరాజ్, వార్డు కౌన్సిలర్ అర్షిఖ రవిష్, సర్పంచ్ శ్రీనివాస్ నాయక్, పొన్నాల యుగేందర్, పంజాల శ్రీనివాస్, బాణోత్ రాము, గుర్రాల సురేష్ పాల్గొన్నారు.