Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీడీఎస్ రక్షణ కోసం బీజేపీని ప్రతిఘటించాలి
- జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్
నవతెలంగాణ-ములుగు
కేంద్ర బడ్జెట్లో నిధులు కోత పెట్టి బిజెపి ప్రభు త్వం ఐసిడిఎస్‌ను బలహీన పరుస్తుందని ఐసిడిఎస్ రక్షణ కోసం కేంద్ర బిజెపి ప్రభుత్వాన్ని ప్రతిఘటిం చాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిల్లా గౌరవ అధ్యక్షులు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ పిలుపు నిచ్చారు. అంగన్వాడీల రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో భాగంగా కలెక్టర్ కార్యాలయం ఎదుట 48 గంటల ధర్నాను ఉద్దేశించి రాజేందర్ శుక్రవారం మాట్లా డారు. అనంతరం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వ హించారు. ఈ సందర్బంగా రాజేందర్ మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం ఐసిడిఎస్‌కు బడ్జెట్లో 60 శాతం నిధులు తగ్గించి గ్రామీణ ప్రాంత పేదలకు పో షక ఆహారాన్ని దూరం చేస్తుందని విమర్శించారు. నాణ్యమైన పోషకాహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్లో నిధులు కోత పెట్టి ఐసిడిఎస్ ను ప్రైవేట్ సంస్థకు అప్పగించే చర్యలను విరమించు కోవాలని డిమాండ్ చేశారు. ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలు అంగన్వాడి సేవలను గుర్తిం చినా కానీ, కేంద్ర ప్రభుత్వ మాత్రం అంగన్వాడీల శ్ర మను గుర్తించడం లేదని విమర్శించారు. అంగన్వా డీల శ్రమదోపిడి చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని పోరా టాల ద్వారా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించటం ద్వారా మాత్రమే ఐసిడిఎస్ రక్షణ నిలుస్తుందని అన్నారు. కనీస వేత నం 26,000 ఇవ్వాలని నూతన విద్యా విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్రం పెం చిన గ్యాస్ ధరల వల్ల ప్రతి అంగన్వాడి టీచర్ లేదా హెల్పర్‌కు ప్రతి సిలిండర్‌పై 500 రూపాయల భా రం పడుతుందని ఈ ఆర్థిక భారాన్ని తగ్గించాలని డి మాండ్ చేశారు. గ్యాస్‌ను ప్రభుత్వమే నేరుగా అంద జేయాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య లక్ష్మి మెనూ చార్జీలు పెంచాలని మే నెల మొత్తం అంగన్వాడి కేం ద్రాలకు వేసవి సెలవులు అమలు చేయాలని డిమాం డ్ చేశారు. కలెక్టరేట్ ధర్నా వద్దకు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి అంజాద్ పాషా, బోడ నర్సింగం, బిఎస్పి జిల్లా అధ్యక్షులు బోట్ల కార్తీక్, ప్రజా సంఘాల జెఏసి నాయకులు ముంజల భిక్షపతి వచ్చి మద్దతు తెలిపారు.కనీస వేతనాలు పెంచడం తోపాటు అంగన్వాడీల న్యాయమైన డిమాండ్స్ పరి ష్కారం చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షరాలు కె సరోజన, కార్యదర్శి కె.సమ్మక్క, పద్మ, వెంకటరమణ, భాగ్య, జమున, మంజుల, సూరమ్మ, పార్వతి, సడాలు,రుక్మిణి, విజయలక్ష్మి, సరిత, సంధ్య, తదితరులు పాల్గొన్నారు.