Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకుర్తి
మహిళలు పట్టుదలతో ముందుకు సాగినప్పుడే లక్ష్యాన్ని చేరుకోవచ్చని ఎంపీపీ నల్ల నాగిరెడ్డి అన్నా రు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృషితో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ ముగింపు కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం మండలంలోని గూడూరు, పాలకుర్తి, చెన్నూరు గ్రా మాల్లో ఆయా గ్రామాల సర్పంచులు మంద కొముర య్య, పుష్కరి పార్వతి రాజేశ్వరరావు అధ్యక్షతన జరి గిన సమావేశాల్లో డిఆర్డిఏ అదనపు ఏపీడి నూరొ ద్దీన్తో కలిసి ఎంపీపీ నల్ల నాగిరెడ్డి మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కార్యక్రమంలో రెండువందల మంది మహిళలు తమ నైపుణ్యాన్ని చాటుకునేందుకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ఏర్పా టు చేయడం అభినందనీయమన్నారు. ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకున్న మహిళలు 19 రకాల దుస్తులను కుట్టి ప్రదర్శించారు. మహిళ లు ఉచిత కుట్టు శిక్షణలో నైపుణ్యాన్ని పెంపొందించి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే మంత్రి ఎర్రబెల్లి లక్ష్యమని తెలిపారు. భవిష్యత్తులో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఎంతగానో ఉపయోగ పడతాయన్నారు. ప్రభుత్వం పాఠశాలలకు అందించే దుస్తులను ఉచిత కుట్టు శిక్షణాలో నేర్చుకున్న మహి ళలు సద్వినియోగం చేసుకొని ఆయా పాఠశాలలకు ప్రభుత్వం అందించే దుస్తులను కుట్టి సరఫరా చేసే విధంగా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూ చించారు. ఈనెల 8న తొర్రూర్లో జరిగే జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సర్టిఫికెట్లతోపాటు ఉచితకుట్టు శిక్షణను సద్వినియోగం చేసుకున్న మహి ళలకు ఉచితంగా కుట్టు మిషన్లను అందజేస్తారని తెలి పారు. మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని, ప్రతి మహిళ తమ శక్తివంచన లేకుండా కుట్టు శిక్షణ కేంద్రంలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం ఇతరులకు,రాబోవు మహిళలకు స్ఫూర్తిదాయకమన్నా రు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్ లీడర్ పుస్కూరి శ్రీనివాసరావు, జిల్లా కో ఆప్షన్ సభ్యులుఎండి మదర్, ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్మన్ ముస్కు రాంబాబు, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, కొడకండ్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, పాలకుర్తి సొసైటీ చైర్మన్ బొబ్బల అశోక్ రెడ్డి, వైస్ చైర్మన్ వేణు, ఏపీఎం రాచకొండ రమణాచారి, సిసిలు వెంకటేశ్వర్లు, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.