Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రనాయక్
నవతెలంగాణ-పాలకుర్తి
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు కూలీల వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూ క్య చంద్ర నాయక్ పిలుపు నిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలో గల వీరనారి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ స్మా రక భవనంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చిట్యాల సోమన్న అధ్యక్షతన సిఐటియు, రైతు సం ఘం, వ్యవసాయ కార్మిక సంఘం సన్నాహక సమా వేశానికి చందు నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి రాత పూర్వకంగా ఇచ్చిన హామీని తుంగలో తొక్కిందని, కనీసం మద్దతు ధరల చట్టం చేస్తానని అమలు చేయ లేదన్నారు. ఎరువుల సబ్సిడీని కుదించడం వల్ల రై తాంగానికి ఆహార భద్రతకు తీవ్ర ముప్పు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటిష్ కాలం నుండి కార్మికు లు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దుచేసి పనిగంటల విధానాన్ని పెంచి కార్మికులు యూనియ న్ పెట్టుకునే అవకాశాన్ని లేకుండా చేసి నాలుగు లేబర్ కోడ్లను తెచ్చి కార్మికుల నడ్డి విరుస్తున్నారన్నా రు. కార్మికుల కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని డి మాండ్ చేశారు. గ్రామీణ ఉపాధి పథకానికి నిధుల కు కోతలు పెట్టిందని విమర్శించారు. కనీసం 200 రోజులు పని దినాలు కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం కంటే నిధులు తగ్గించిందన్నారు. ఈనెల 11న పాలకుర్తిలో సీఐటీయూ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మండల స దస్సు నిర్వహించడం జరుగుతుందని ఈ సదస్సును కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సోమ సత్యం, రై తు సంఘం మండల కార్యదర్శి పనికిరా రాజు, ప్రజా సంఘాల మండల నాయకులు శ్రీలత, కే.రమేష్, జి.రాము, కే.స్వామి తదితరులు పాల్గొన్నారు.